యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ – ‌‌2019 ఫలి‌తాల విడుదల

Civil Services Examination, Civil Services Examination 2019, Civil Services Examination Results, Civil Services Examination-2019 Results, UPSC, UPSC Released Civil Services Examination-2019 Result

సివిల్‌ సర్వీసెస్-2019 ఫలితాలను ఆగస్టు 4, మంగళవారం నాడు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 829 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 ఫలితాలు లేదా అభ్యర్థుల తాత్కాలిక నియామక జాబితాను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. ఎంపికైన 829 మందిలో జనరల్‌ 304 మంది, ఓబీసీ 254, ఎస్సీ 129, ఈబీసీ 78, ఎస్టీ 67 మంది ఉన్నారు. వీరంతా మెరిట్ ను బట్టి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ అండ్ గ్రూప్-బి అధికారులుగా నియమించబడనున్నారు. కాగా ఈ సివిల్‌ సర్వీసెస్ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిషోర్‌ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్‌ సాధించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here