నేను ఎన్నికల్లో పోటీ చేయను.. బండి మొండి పట్టు

I will not contest the elections bandi is stubborn,I will not contest the elections,elections bandi is stubborn,Mango News,Mango News Telugu,bandi sanjay, telangana politics, bjp,bandi sanjay Latest News,Bandi sanjay Latest Updates,Bandi sanjay Live News,Telangana Chief Minister Kcr,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Bandi is stubborn Latest News
bandi sanjay, telangana politics, bjp,

తెలంగాణ బీజేపీని కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయి. అన్ని పార్టీలతో పోల్చుకుంటే.. ఆ పార్టీ వెనుకంజలో దూసుకెళ్తోంది. తిరిగి పుంజుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఆ పార్టీకి బిగ్ షాకులు తగులుతున్నాయి. అన్ని పార్టీల్లో నేతలు టికెట్ల కోసం ఎగబడుతుంటే.. బీజేపీలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. టికెట్ ఇస్తామంటున్నా కూడా.. నేతలు వద్దంటే.. వద్దంటున్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెబుతున్నారు.

కొందరు సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. ఎంపీ టికెట్‌నే టార్గెట్‌గా చేసుకొని పావులు కదుపుతున్నారట. ఈసారి ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతుండడంతో.. నేతలు పోటీ చేసేందుకు ఆసక్తితో లేరట. అలాగే ఈసారి కాకుండా డైరెక్ట్‌గా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల ఖర్చును తగ్గించుకోవచ్చని నేతలు భావిస్తున్నారట. అందుకే అధిష్టానం టికెట్ ఇస్తామంటున్న కూడా.. తాము పోటీ చేయమని చెబుతున్నారట.

మొన్నటి వరకు కిషన్ రెడ్డి కూడా అదే పాట పాడారు. గత ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అధిష్టానాన్ని కూడా ఒప్పించారు. ఇప్పుడు మిగిలిన సీనియర్లు కూడా కిషన్ రెడ్డి బాటలో నడుస్తున్నారు. తాము కూడా ఈసారి పోటీ చేసేందుకు రెడీగా లేమని అధిష్టానానికి రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. తమ స్థానంలో వేరే వారికి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటి నుంచి ఆయన అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. అటు ఆయన సూచించిన అభ్యర్థులకు కూడా టికెట్లు కేటాయించకపోవడంతో.. అధిష్టానంపై ఆయన మరింత ఆగ్రహంతో ఉన్నారట. దీంతో బండి సంజయ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనంటే.. చేయనని మొండి పట్టుపట్టుకొని కూర్చున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =