మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధింపు

Corona Positive Cases in Maharashtra, maharashtra, Maharashtra Corona Deaths, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19, Maharashtra Covid-19 lockdown, Maharashtra Covid-19 lockdown news, Maharashtra Covid-19 lockdown news live, Maharashtra Government Imposes Night Curfew, Maharashtra Government Imposes Night Curfew And Partial Lockdown Amid COVID-19 Rise, Maharashtra Government Imposes Partial Lockdown Amid COVID-19 Rise, Maharashtra Lockdown, Maharashtra Lockdown News, Mango News, night curfew imposed in Pune, Pune shutdown

రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేబినెట్ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటుగా వీకెండ్స్ లో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30, 2021 వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నారు. అదేవిధంగా వీకెండ్స్ లో అనగా శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.

మహారాష్ట్రలో అమల్లోకి వచ్చే లాక్‌డౌన్ ఆంక్షల్లో కొన్ని:

  • సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూ విధింపు.
  • ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) ఐదుగురు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకూడదు.
  • మిగిలిన రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు (వీక్ డేస్) మరియు శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు సరైన కారణం లేదా పర్మిషన్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ తిరగకూడదు.
  • మెడికల్, ఇతర అత్యవసర సేవలు అనుమతించబడతాయి.
  • రెస్టారెంట్లలో టేకావే మరియు హోమ్ డెలివరీలు అనుమతించబడతాయి.
  • కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో హోటళ్లు, మాల్స్‌, బార్లు మూసివేత.
  • బ్యాంకులు, విద్యుత్, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, టెలికం వంటి కార్యాలయాలు నడుస్తాయి.
  • ఇ-కామర్స్ సేవలు కొనసాగుతాయి.
  • ఆటోలు, టాక్సీలు, బస్సు సేవలు కొనసాగుతాయి.
  • మాస్క్ ధరించకుంటే రూ.500 ఫైన్ విధింపు.
  • ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో విధుల నిర్వహణ, ప్రైవేటు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని సూచన.
  • స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూసివేత.
  • థియేటర్లు మూసివేయబడతాయి, ఫిల్మ్ షూట్స్ కు రద్దీలేకుండా నిబంధనలతో అనుమతి.
  • మతపరమైన ప్రదేశాల్లో అనుమతి లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =