తెలంగాణలో కటింగ్, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Decided to Provide upto 250 units of Free Electricity to Salon, CM KCR Good News For Salon Shop Dhobi Ghat Laundry, Dhobi Ghats, Free Electricity to Salon Laundry shops and Dhobi Ghats, Free Electricity to Salon Laundry shops and Dhobi Ghats In Telangana, Hair Salons, KCR Free Electricity to Salon Laundry shops and Dhobi Ghats, KCR offers free water and electricity, Laundry Shops, Mango News, Telangana CM KCR, TRS government announces free electricity to saloons, Up to 100 units of free electricity to those shops

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తిశాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తులను పరిశీలించిన మీదట సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన జీఓను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్ 1 తేదీ నుంచే అమల్లోకి రానున్నది.

అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేకల పథకాలను అమలు పరుస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా వున్న కటింగు షాపులకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్ల కు 250 (రెండు వందల యాభై) యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. తద్వారా, తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు. సాంకేతికాభివృద్ది కారణంగా పలు రకాల యంత్రాలు వీరి కుల వృత్తుల నిర్వహణలో దోహద పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 16 =