అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం : సీఎం వైఎస్ జగన్

CM Jagan Announced Financial Assistance of Rs.30 Lakh to Kin of Deceased in Chhattisgarh Encounter

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగిన ఘటనలో జవాన్ల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ఈ ఘటనలో అమరులైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొంటూ, రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఛత్తీస్‌గఢ్ ఘటనలో ఏపీలోని విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ అనే జవాన్లు అమరులయ్యారు. వారిద్దరి కుటుంబాలకు చెరో రూ.30 లక్షల చొప్పున వెంటనే సహాయం అందించి వారికీ అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 9 =