ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Actress Jayanthi Passed Away, bengaluru, Jayanthi Death, Jayanthi Death News, Jayanthi Death Updates, Mango News, Veteran Actress Jayanthi, Veteran Actress Jayanthi Dies At 76, Veteran Actress Jayanthi Dies At 76 In Bengaluru, Veteran actress Jayanthi no more, Veteran Actress Jayanthi Passed Away, Veteran actress Jayanthi passes away at 76, Well-Known Veteran Actress Jayanthi, Well-Known Veteran Actress Jayanthi Passed Away

ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జయంతి కర్ణాటకలోని బల్లారిలో జన్మించారు. క్లాసికల్ డాన్స్ లో శిక్షణ పొందిన ఆమె 1963లో జెనుగూడు అనే కన్నడ చిత్రంతో నటిగా సినీరంగ ప్రవేశం చేశారు. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో ఆమె 500కి పైగా చిత్రాలలో నటించారు. అనేక విభిన్న పాత్రలు పోషించడం ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

ముఖ్యంగా కన్నడ చిత్రాలలో నటనకు గానూ ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. నాలుగు సార్లు ఉత్తమ నటిగా, రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా ఆమె కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది. కన్నడ సినీ దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్‌ తో కలిసి ఆమె 40కు పైగా చిత్రాల్లో నటించింది. అలాగే నందమూరి తారక రామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌ సహా పలువురు ప్రముఖ నటుల సినిమాల్లో జయంతి కీలకపాత్రలు పోషించారు. తెలుగులో జయంతి నటించిన జస్టిస్‌ చౌదరి, కొండవీటి సింహం, పెదరాయుడు వంటి చిత్రాలు ఎంతో పేరు తెచ్చాయి. జయంతి మృతి పట్ల పలు చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు, పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =