రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

10 things to know about Telangana’s Ramappa temple, 800-years-old Rudreswara Temple, Kakatiya Rudreshwara Temple, Lesser-known Telangana temple becomes a World Heritage, Mango News, Minister Srinivas Goud Says Govt Set up Management Committee for Ramappa Temple, Panel to protect Ramappa temple, Ramappa Temple, Ramappa Temple in Palampet, Ramappa Temple News, Ramappa Temple to get Heritage status soon, Telangana govt making all efforts to get Ramappa Temple, Telangana has been Inscribed as a UNESCO World Heritage Site

తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు రావడంపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. తెలంగాణ చారిత్రక సంపద రామప్ప దేవాలయంకు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి పలితంగా ఈ రోజు రామప్పకు, తెలంగాణకు గుర్తింపు లభించిందని మంత్రి అన్నారు. తెలంగాణ వారసత్వ, చారిత్రక, సాంస్కృతి, సాంప్రదాయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు. తెలంగాణ మహనీయలను, సాహితివేత్తలను, చరిత్రకారులను, సామాజిక వేత్తలను, కవులను, కళలను, కళకారులను గౌరవించి వారి జయంతి, వర్థంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 70 ఎళ్లుగా తెలంగాణలోని కళలు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేసారని చెప్పారు.

అద్భుతమైన శిల్పకళాఖండంగా రామప్ప దేవాలయంను మంత్రి అభివర్ణించారు. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణమన్నారు. కాకతీయుల ఘనచరిత్రకు శిల్ఫాకళా నైపుణ్యానికి, కళలకు, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం ఈ రామప్ప దేవాలయమన్నారు. రామప్ప దేవాలయానికి ఎప్పుడో యునెస్కో గుర్తింపు రావాల్సిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరగని ఎన్నో అద్భుతాలు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారబోతోందన్నారు. ప్రపంచ పర్యాటకులు ఈ దేవాలయంను సందర్శించడం వల్ల ఆ స్థాయిలో హోటల్ పరిశ్రమ, ట్రావిలింగ్, గైడింగ్ మొదలగు రంగాల్లో రాష్ట్రంలో యువతకు ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తాజ్ మహాల్ ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు మూలంగా ఆగ్రా పట్టణము పూర్తిగా పర్యాటక రంగంపై ఆదారపడిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతే గాకుండా ఐరోపాలోని కోన్ని దేశాలు ఇటలీ, ప్రాన్స్, ఈజిప్టు, స్పేయిన్ మరియు రోమ్, పారిస్ లాంటి పట్టణాలు టూరిజంపై ఆదారపడి వున్నాయన్నారు. ప్రపంచమే అబ్బుర పడే ఎన్నో గొప్ప కట్టడాలు తెలంగాణలో ఉన్నాయని, ముత్యాల ధర, వెయ్యి స్థంభాల గుడి, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహి టూంబ్స్, పిల్లల మర్రి లాంటి అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ కే తలమానికమన్నారు.

రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో కృషి చేసిన సహాచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కాకతీయ హెరిటేడ్ ట్రస్ట్ సభ్యులు పాపారావు, పాండురంగారావు, ఎంపీ బండా ప్రకాష్ సహా ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు విశేష కృషి చేసిన రష్యా, నార్వే తదితర దేశాల దౌత్యవేత్తలకు, కేంద్రపభుత్వానికి, కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాదికారులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.యస్ శ్రీనివాస రాజు, పురావస్తు శాఖ ఉప సంచాలకులు నారాయణ, రాములు నాయక్, మాధవి, రాజు, సిబ్బంది పాల్గోన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =