కార్గిల్ విజయ్ దివాస్ 2021: అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ

22nd Anniversary of Kargil Vijay Diwas, Defense Minister of India, India Celebrates 22nd Anniversary Of Kargil Victory, India Celebrates 22nd Anniversary Of Kargil Victory As Kargil Vijay Diwas, Kargil, Kargil Victory As Kargil Vijay Diwas, Kargil Vijay Diwas, Kargil Vijay Diwas 2021, Kargil Vijay Diwas News, Kargil Vijay Diwas Updates, Mango News, Prime Minister Narendra Modi, Rajnath Singh

భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో 22 సంవత్సరాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 నుండి జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. యుద్ధంలో విజయం అనంతరం జూలై 26న భారతసైన్యం కార్గిల్‌లో జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని సోమవారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జమ్మూకశ్మీర్‌ బారాముల్లాలోని డాగర్ వార్ మెమోరియల్ వద్ద దేశాన్ని రక్షించడంలో ప్రాణాలను అర్పించిన సైనికులందరికీ నివాళులు అర్పించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ కార్గిల్ యుద్ధంలో అమరువీరులైన వారి త్యాగం, శౌర్యం చిరస్మరణీయమని అన్నారు. “ఈ రోజు కార్గిల్ విజయ్ దివాస్‌ సందర్భంగా మన దేశాన్ని రక్షించడానికి కార్గిల్‌ లో ప్రాణాలు అర్పించిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. వారి ధైర్యం ప్రతిరోజూ మనలో ప్రేరణ కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే కార్గిల్ విజయ్ దివాస్ 2021 సందర్భంగా న్యూఢిల్లీ లోని నేషనల్ వార్ మెమోరియల్‌ ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. దేశం కోసం ధైర్యంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. వారి అత్యున్నత త్యాగం ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడుతుందని మరియు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =