ప్రముఖ టాలీవుడ్ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష అనుమానాస్పద మృతి…

Famous Fashion Designer Prathyusha Garimella Found Lost Life at Her Residence in Hyderabad, Famous Fashion Designer Prathyusha Garimella Found Lost Life, Famous Fashion Designer Prathyusha Garimella Found Lost Life at Her boutique studio in the posh Banjara Hills, boutique studio in the posh Banjara Hills, posh Banjara Hills, boutique studio, Famous Fashion Designer Prathyusha Garimella, Famous Fashion Designer, Prathyusha Garimella, Top celebrity fashion designer, Top Fashion Designer Found Dead, Celebrity fashion designer Prathyusha Garimella, fashion designer Prathyusha Garimella was found dead at her residence in Banjara Hills, fashion designer Prathyusha Garimella News, fashion designer Prathyusha Garimella Latest News, fashion designer Prathyusha Garimella Latest Updates, fashion designer Prathyusha Garimella Live Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ టాలీవుడ్ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష శనివారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ప్రత్యూష, మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్నానాల గదిలో మృతదేహం పక్కన కార్బన్‌ మోనాక్సైడ్‌ బాటిల్‌ పడి ఉండటాన్ని గుర్తించారు. ఇది విషవాయువు కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం కోసం ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వారు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రత్యూష డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రత్యూష దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశంలోని టాప్ 3 ఫ్యాషన్‌ డిజైనర్స్‌లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్‌ చేసేవారు. ఇప్పుడు ఆమె మరణవార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ చదివి హైదరాబాద్‌లో కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరియు బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖుల కోసం ఆమె పనిచేసింది. అయితే ఇలాంటి తరుణంలో కేవలం 35 ఏళ్ల వయస్సుకే ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయితే కానీ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here