భారత్‌లో మళ్ళీ శరవేగంగా వ్యాపిస్తోన్న కరోనా.. ఒక్కరోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు

India Records 10158 New Covid-19 Positives in Last 24 Hours A Massive Jump in Cases After 8 Months,India Records 10158 New Covid-19 Positives,Covid-19 Positives in Last 24 Hours,A Massive Jump in Cases After 8 Months,Mango News,Mango News Telugu,Massive Jump in Covid-19 Tally,Coronavirus India Latest News,India Records Highest Single-day Tally,India reports over 4000 Covid cases,Coronavirus Latest News,India Coronavirus Map and Case Count,India Coronavirus Statistics,Official Updates Coronavirus,Information about COVID-19,India Covid Last 24 Hours Report,Active Corona Cases,Corona Active Cases Exceeds,MoHFW,India Fights Corona

భారతదేశంలో మరోసారి కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం, పది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్‌ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. ఏకంగా 10 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 10,158 కొత్త కోవిడ్-19 పాజిటివ్‌లు నమోదయ్యాయ. తద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరుకుంది. కాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మొత్తం 2,29,958 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,158 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,86,160కి చేరినట్లయింది. అలాగే 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,31,035కి చేరుకుంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 13, ఉదయం 8 గంటల వరకు):

  • గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,29,958
  • కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 12–ఏప్రిల్ 13 (8AM-8AM)] : 10,158
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,86,160
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 5,356
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,10,127
  • కరోనా రికవరీ రేటు : 98.71 శాతం
  • యాక్టివ్ కేసులు : 44,998
  • కొత్తగా నమోదైన మరణాలు : 19
  • మొత్తం మరణాల సంఖ్య : 5,31,035
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 (220,66,24,653) కోట్లు పంపిణీ.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eight =