తెలంగాణలో రూ.400 కోట్ల పెట్టుబడితో జీఈఎఫ్‌ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు, మంత్రి కేటీఆర్ ప్రకటన

Minister KTR Announce that Gemini Edibles and Fats India Ltd will be Investing Rs 400 Cr in Telangana to set up a Refinery, Gemini Edibles and Fats India Ltd, Gemini Edibles and Fats Investing Rs 400 Cr in Telangana, Gemini Edibles and Fats to set up a Refinery in TS, Mango News, Mango News Telugu, KTR Announced Gemini Edibles and Fats will Investement Rs 400 Cr in TS, KTR Announced Gemini Edibles and Fats Investement, Gemini Edibles and Fats Investement TS, Gemini Edibles and Fats Latest TS Investement, Gemini Edibles and Fats Latest News And Updates

తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ లిమిటెడ్ (జీఈఎఫ్‌) రూ.400 కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్ సింగపూర్, ఫ్రీడమ్ ఆయిల్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ఎడిబుల్ ఆయిల్స్ తయారీదారు జీఈఎఫ్‌ 400 కోట్ల రూపాయలతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తుందని ప్రకటిస్తునందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఇప్పటికే 2వ హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం ఇలా నాలుగు విప్లవాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా పసుపు విప్లవానికి కూడా శ్రీకారం చుట్టాలని తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా జెమిని ఎడిబుల్స్ పెట్టుబడి తెలంగాణ నుండి ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మరియు స్థానిక నూనెగింజల రైతులకు కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ముందుగా మంత్రి కేటీఆర్‌ తో జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశమై పెట్టుబడిపై చర్చించారు. ఈ సందర్భంగా జీఈఎఫ్‌ పెట్టుబడి నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆయిల్ రిఫైనరీ యూనిట్‌ అనంతరం 1000 మందికి ఉపాధి లభించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =