ఏపీ సచివాలయంలో ఉద్యోగుల పెన్‌డౌన్‌.. రివర్స్ పీఆర్సీపై నిరసన

AP Employees, AP Employees Chalo Vijayawada Programme, AP Employees Issues, AP Employees PRC, AP Employees PRC Issue, AP Secretariat Employees, AP Secretariat Employees Pen Down Regarding New PRC, AP Secretariat Employees Pen Down Regarding New PRC Issue, Chalo Vijayawada, Chalo Vijayawada Programme, Mango News, New PRC Issue, pawan kalyan, Pen Down Regarding New PRC Issue, PRC Issue

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నిన్న తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమవడంతో ఉద్యోగుల్లో ధైర్యం పెరింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలవడం వారిలో ఉత్తేజాన్ని నింపింది. వారి డిమాండ్ సరైనదే అని ప్రభుత్వం తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు సమర్ధించాయి. ఒకవైపు ప్రభుత్వం మీకు జీతాలు పెంచమని చెబుతున్నా.. ఉద్యోగులు నమ్మటంలేదు. అందుకే, మాకు మా పాత జీతాలే ఇవ్వండి అంటూ రివర్స్ పీఆర్సీ పైన నిరసన తెలుపుతున్నాయి. దీనిలో భాగంగా మరో రెండు రోజుల్లో.. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాయి ఉద్యోగ సంఘాలు. అయితే, అంతకుముందే సెక్రటరియేట్ ఉద్యోగులు పెన్ డౌన్, సిస్టమ్ డౌన్, యాప్ డౌన్ అంటూ కొత్తరకంగా తమ నిరసన తెలియజేస్తున్నారు.

అయితే, ఒకవైపు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ఉద్యోగులు అంటుంటే.. మరోవైపు ఇదంతా ప్రతిపక్షాల కుట్రని, ర్యాలీలో పాల్గొన్నవారంతా ఉద్యోగులు కాదని ప్రభుత్వంలోని వారు వ్యాఖ్యలు చేయడం ఉద్యోగ సంఘాల నేతలకు ఆగ్రహం తెప్పించింది. అందుకే.. ‘ఛలో విజయవాడ‘ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వారున్నట్లు నిరూపించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మొదట, శనివారం నుంచి సహాయ నిరాకరణ చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. అయితే, సచివాలయంలో శనివారం సెలవు కావడంతో శుక్రవారంమే సహాయ నిరాకరణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఉద్యోగులు. ఈక్రమంలోనే.. ఈరోజు పెన్ డౌన్, సిస్టమ్ డౌన్, యాప్ డౌన్ వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతోపాటు సచివాలయంలో ఉన్న అన్ని బ్లాకుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉద్యోగులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − seven =