గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ గురువారం అంటే సెప్టెంబర్ 28న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
జంట నగరాలతో పాటు మేడ్చల్, మాల్కాజిగిరి జిల్లాలకు కూడా సెలవును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
మరోవైపు గణనాధుని నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడానికి.. ఏపీతోపాటు కేంద్ర బలగాలనూ రంగంలోకి దింపినట్లు తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ ఫోర్స్‌తో కూడా నిఘా పెట్టారు.
నవరాత్రుల్లో భక్తులతో పూజలందుకున్న గణపతి విగ్రహాలను మూడోరోజు నుంచే హుస్సేన్ సాగర్ తో పాటు చెరువులు, కృత్రిమ సరస్సుల్లో నిమజ్జనం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే తెలంగాణ పోలీసు శాఖ భారీగా బందోబస్తు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంతో పాటు గణేష్ శోభయాత్రలు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు
గణేష్ నిమజ్జనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ..నిమజ్జనం కోసం దాదాపు 3600 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు.
వినాయక చవితి కోసం నెల రోజుల ముందు నుంచే సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. ఇటు గతేడాది 9 వేల విగ్రహాలు ప్రతిష్టించగా.. ఈసారి 11వేల విగ్రహాలు ఏర్పాటు చేశారని, దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఏర్పాట్లు చేశామని సీపీ చౌహాన్ చెప్పారు.
హైదరాబాద్ జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భారీగా బస్సు సర్వీసులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.గణపతి నిమజ్జనం వేళ 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించవచ్చని సజ్జనార్ సూచించారు.మరోవైపు హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా నిమజ్జనం వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE