హైదరాబాద్‌లో ఫుడ్ కల్చర్ లిస్ట్‌లో కర్చీఫ్ పరిచేసిన..ఫైర్ పానీ పూరీ !

Fire Pani Puri Made by Karchef in the List of Food Culture in Hyderabad,Fire Pani Puri Made by Karchef,Karchef in the List of Food Culture,Food Culture in Hyderabad,Fire Pani Puri,Mango News,Mango News Telugu,Pani Puri,Ragda Puri, Dahi Puri, Chocolate Puri,Pani Puri Cart, Fire Pani Puri cause a lot of damage to health,Hyderabad Fire Pani Puri,Food Culture,Hyderabad Food Culture,Indias very first fire Golgappa,Indian street food,Fire pani puri recipe,Is fire pani puri safe,List of Food Culture in Hyderabad,Fire Pani Puri Latest News,Fire Pani Puri Latest Updates,Hyderabad News,Hyderabad Latest News And Updates,Hyderabad Fire Pani Puri Latest News,Hyderabad Fire Pani Puri Live Updates

దేశంలో ఎక్కడ ఏ వంటకం ఫేమస్ అయినా.. అది కొద్ది రోజుల్లోనే రెక్కలు కట్టుకుని మరీ హైదరాబాద్‌లో వాలిపోతుంది. విభిన్న సంస్కృతులను, మతాలను భాగ్యనగర వాసులు ఎలా ఆదరిస్తారో.. అంతకు మించి డిఫరెంట్ ప్లేవర్స్, డిఫరెంట్ స్టేట్స్ స్పెషల్ ఫుడ్స్‌ను కూడా అలాగే అక్కున చేర్చుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందులేదు.. అందుగలదన్న సందేహం వలదన్న ప్రహ్లాదుడి మాటలను నిజం చేస్తూ హైదరాబాద్‌లో దొరకని ఫుడ్ ఐటెమ్స్ (Food items) చెప్పగలరా అంటూ భోజన ప్రియులు సవాల్ కూడా విసురుతూ ఉంటారు.

అందుకేనేమో మొన్నెప్పుడో ఉత్తరాదిలో కనిపించే ఫైర్ పానీ పూరీ (Fire Pani Puri) ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంటరయిపోయింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్‌లో కొత్త ఫుడ్ కల్చర్ (Hyderabad Food Culture) లిస్ట్‌లో ఫైర్ పానీ పూరీ కర్చీఫ్ పరిచేసింది. అందరినీ అంతలా ఆకట్టుకుంటోన్న ఈ ఫైర్ పానీ పూరీని నోట్లో వేసుకుంటే ఏం కాదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వింత తిండిని జనాలు ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇలాంటి రిస్కీ తిళ్లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

పానీ పూరీ అంటే హైదరాబాదీలకు యమా క్రేజ్..

మామూలుగానే పానీ పూరీ ( Pani Puri) అంటే హైదరాబాదీలకు యమా క్రేజ్. అందుకే ఏ సాయంత్రం అయినా అమ్మాయిలు, అబ్బాయిలు గుమికూడి ఉన్నారంటే.. అక్కడ పానీ పూరీ బండి ఉంటుందన్నది కచ్చితంగా చెప్పొచ్చని చాలామంది ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఉంటారు. సరదాగా అంటున్నా కూడా ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ నిజమని ఒప్పేసుకుంటారు గోల్ గప్పా లవర్స్. ఎందుకంటే అది హైజెనిక్ ఫుడ్ కాదని.. అస్సలు శుభ్రంగా చేయరని ఎవరు వెనక్కి లాగినా పానీ పూరీ లవర్స్ మాత్రం తగ్గేదేలే అంటూ ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగించేస్తూనే ఉంటారు. అబ్బాయిలు ఏదో అనుకుంటే అమ్మాయిలు కూడా ఏం తగ్గకుండా వారితో పందేలు వేసుకుని మరీ తింటుంటారు.

ఒక్క కరోనా టైమ్‌లో కాస్త భయపడినా.. ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నా పానీ పూరీ బండి (Pani Puri Cart)కి ఫుల్ గిరాకీనే ఉంటుంది. ఇలాంటి క్రేజ్ ఉండటం వల్లేమో.. దహీ పానీ పూరీ, స్వీట్ పానీ పూరీ వంటి ఎన్నో వెరైటీస్ భాగ్యనగరవాసులను మరింత ఫిదా చేసేశాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో హాట్ ఫ్లేవర్.. ఫైర్ పానీ పూరీ యాడ్ అయిపోయింది. ఫైర్ పాన్‌లాగే.. దీనిని కూడా మండుతున్నప్పుడే తింటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా చోట్ల పానీ పూరీ బండుల్లోనూ ఇది స్పెషల్ క్రేజీ ఐటెమ్‌గా మారిపోయింది.

ఫైర్ పానీ పూరీ తయారీ..

ఫైర్ పానీ పూరీ (Fire Pani Puri Recipe) తయారీ కూడా సాధారణ పానీ పూరీలాగా ఉంటుంది. పానీపూరీలో వాడే పూరీలో బాదాం, కిస్మిస్, కొబ్బరి తురుము, సోంపు, పాన్ మసాలా వంటివి దాదాపు పది పదిహేను పదార్థాలను కలుపుతారు. ఆ తర్వాత ఆ ముద్దపై వంటల్లోనూ, తిరుమల లడ్డూలోనూ వాడే పచ్చ కర్పూరాన్ని ఉంచి.. దానిని వెలిగిస్తారు. అది మండుతూ ఉండగానే నోట్లో వేసుకుని తినేస్తారు. కాస్త డిఫరెంట్ టేస్ట్… అంతకు మించి థ్రిల్ ఇచ్చే ఎక్స్సీరియన్స్ ఉండటం వల్ల యూత్ చాలామంది దీనిని తినడానికి ఎగబడుతున్నారు. అందుకే రోజురోజుకు ఈ పానీ పూరీ బండ్లు గల్లీగల్లీలోనూ పెరిగిపోతున్నాయి. దీనిలోనే ఆరు వెరైటీలతో ఫైర్ పానీ పూరీని అందించడంతో హైదరాబాదీలు దీనిని టేస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.

ఫైర్ పానీ పూరీపై కామెంట్లు…

ఫైర్ పానీ పూరీ (Fire Pani Puri)తో పాటు రగ్దా పూరీ (Ragda Puri), దహీ పూరీ (Dahi Puri), చాక్లట్ పూరీ (Chocolate Puri) వంటి 6 రుచులు దీనిలో హైలెట్ అవుతున్నాయి. దీంతో ఫైర్ పానీపూరీ తింటూ తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నవారి క్రేజ్ ఎక్కువ అయిపోతుంది. అయితే దీనిపై భిన్నంగా స్పందించేవారూ కూడా ఎక్కువమందే ఉంటున్నారు. కడుపుతో పాటు, మనసుకు నచ్చే ఫుడ్ తినొచ్చు కానీ.. ఇదేం పిచ్చి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వింత తిండ్లు ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుంది కదా అని అంటున్నారు. రిస్కీ తిళ్లు తింటూ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టేసుకోవడం ఎందుకని కాస్త ఘాటుగానే హెచ్చరిస్తున్నారు.

డాక్టర్లు ఏమంటున్నారు..

నిజమే అప్పుడు ఫైర్ పాన్ అవ్వొచ్చు.. ఇప్పుడు ఫైర్ పానీ పూరీ కావొచ్చు .. ఇలాంటి ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి ఎంతో కొంత నష్టం జరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఫైర్ కోసం వాడే కొన్ని పదార్థాలలో క్లీన్సింగ్ ఉంటుందని.. అది అల్సర్లు, ఇతర కడుపు సంబంధిత జబ్బులు రావడానికి, పెరగడానికి కూడా కారణమవుతాయని అంటున్నారు. ఈ నిప్పు తినేటప్పుడు ముక్కు, నోరు కాలే ప్రమాదంతో పాటు.. రుచు గ్రంధులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి ఫుడ్స్ తరచూ తింటే గొంతుకు కూడా డేంజరేనని చెబుతున్నారు. ఈ క్రేజ్ హైదరాబాదీలకు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =