చాలా మంది ఫోర్ వీలర్స్ నడిపినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు సడన్‌గా కళ్లు తిరిగినట్లు, ఏదో ఒక సైడ్‌కు వెహికల్ వెళ్లి పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ కూడా చేస్తారు. ఏం జరిగిందో తెలియనట్లు సడన్‌గా స్టీరింగ్ వదిలేస్తారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు ఉంటే మీ మెదడులోని బ్యాలెన్స్ సిస్టంలో ఏదో లోపం వల్లే ఇలా జరుగుతూ ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీన్నేమెడికల్ లాంగ్వేజ్‌లో మోటరిస్ట్ వెస్టిబులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్ (Motorist vestibular syndrome) అంటారు.
రోడ్డు యాక్సిడెంట్స్‌లో 50% వరకు బ్రెయిన్ బ్యాలెన్స్ సిస్టం (Brain balance system)లో కలిగే సమస్యల వల్లే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ చెబుతున్నారు. డ్రైవింగ్ చేయాలి అంటే.. మన కళ్ల నుంచి మెదడు వరకు కో ఆర్డినేషన్ వ్యవస్థ ఉంటుంది. అది సక్రమంగా పని చేస్తేనే వెహికల్ నడిపే విధానం బాగుంటుంది. అది సక్రమంగా పని చేయకపోతే మెదడు బ్యాలెన్స్ తప్పుతుందని అంటున్నారు. ఈ బ్యాలెన్స్ సమస్య వల్లే పెద్దపెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు.. తాగి డ్రైవ్ చేయడమో లేక వేరే ఏమైనా కారణాలున్నాయో అనుకుంటారు. లేదా డ్రైవింగ్ సరిగా నేర్చుకోకుండానే వెహికల్ నడిపాడేమో అందుకే ఇలా యాక్సిడెంట్స్ అయ్యిందేమో అంటారు. కానీ ఇలా యాక్సిడెంట్ చేసిన వాళ్లలో.. చాలా మందికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండి ఉండొచ్చు లేదా.. బ్యాలెన్స్ సిస్టంలో ఏమైనా సమస్య ఉందేమోనని ఎవరూ అనుకోరు. ఇంకా కొన్ని కేసుల్లో యాక్సిడెంట్ చేసిన వాళ్లు కూడా తమకు బ్యాలెన్స్ సిస్టంలో సమస్య ఉందని గుర్తించలేరు. కళ్లు తిరిగితే నీరసం అనుకుంటారు. సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇలా జరిగిందనుకుంటారు తప్ప వేరేగా అనుకోరు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాంతుల ఫీలింగ్ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ (Gastric problem) అనుకుంటారు తప్ప బ్యాలెన్స్ సిస్టం సక్రమంగా పని చేయకే ఇదంతా అని అనుకోరు.
నిజానికి చాలామందిలో.. తమలో బ్యాలెన్స్ సమస్య ఉందన్న సంగతే తెలియదు. మానసిక సమస్యలతో బాధపడేవారు, డిప్రెషన్, భయం ఉన్న వారిలో ఇలాంటి బ్యాలెన్స్ సమస్యలు వస్తుంటాయని అంతర్జాతీయ అధ్యయనంలో గుర్తించారు. ఇలాంటి సమస్య ఉన్నవారిలో 66% మందికి ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు ఈ సమస్యను ఫేస్ చేస్తారు. 58% మందికి టర్నింగ్ సమయంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారు. 40 % మందికి వేరు వాహనాన్ని చూసినప్పుడు కంగారు, కళ్లు తిరగడం వంటివి తెలీకుండానే వస్తాయి. 25% మందికి బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నప్పుడు, అలాగే హైట్ నుంచి పల్లానికి వెళ్తున్నప్పుడు కళ్లు తిరుగుతాయి. 29% మందికి విచిత్రంగా ఓవర్టేక్ చేసేటప్పుడు కళ్లు తిరుగుతాయి. ఇక 12 శాతం మందిలో ఇరుకైన సొరంగ మార్గాల్లోంచి వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్య ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ క్లారిటీగా ఉండాలి. అంటే స్పేషియల్ కాగ్నెటివ్ ఎబిలిటీ (Spatial cognitive ability)ని కలిగి ఉండాలన్నమాట. కాళ్లు, చేతుల మధ్య కోఆర్డినేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఇందులో మనిషి బ్రెయిన్, కొన్ని నరాలు కూడా యాక్టివ్‌గా ఉండాలి. ఎలా అంటే ఆప్టిక్ నర్వ్ చూడటానికి.. ఆక్యులో మోటార్ నర్వ్.. కళ్లు అటూ ఇటూ తిప్పి చూడడానికి కో ఆపరేట్ చేస్తాయి. అలాగే వెస్టిబిలో కాక్లియర్ నర్వ్.. మన బ్యాలెన్స్‌ను కంట్రోల్ చేస్తుంది. వెహికల్‌ను ముందుకు తీసుకువెళ్లాలన్నా, వెనక్కు తీసుకు వెళ్లాలన్నా కూడా ఇదే నియంత్రిస్తుంది.
అలాగే స్పైనల్ యాక్సెసరీ నర్వ్..మెడను అటూ ఇటూ తిప్పడాన్ని కంట్రోల్ చేస్తోంది. ఇవన్నీ కాకుండా బ్రెయిన్లో ఉన్న మోటార్ సెరిబెల్లార్ సిస్టం, ఎక్స్ట్రా పిరమిడల్ సిస్టం కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే మనం డ్రైవ్ చేయాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్‌గా పని చేయాలి. వెస్టిబిలో కాక్లియర్ నర్వ్.. వెహికల్ నడపడానికి, వెనక్కు ముందుకు జరగడానికి..ఇలా మొత్తం బ్యాలెన్స్‌ను కంట్రోల్ చేస్తుంది. మెయిన్ ఈ నరంలో సమస్య ఏర్పడితేనే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. అలా వచ్చే మోటరిస్ట్ వెస్టిబిలో సిండ్రోమ్ (Motorist vestibular syndrome).. స్కిల్డ్ డ్రైవర్లలో సడన్‌గా వచ్చే సమస్యగా ఉంటుంది. ట్రక్, బస్, లారీ డ్రైవర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.
మోటరిస్ట్ వెస్టిబిలో సిండ్రోమ్ (Motorist vestibular syndrome) వల్ల 79 శాతం మందిలో డిసోరియెంటేషన్ ఏర్పడటం వల్ల.. సడన్‌గా వాళ్లు ఏం చేస్తున్నారో కానీ, ఎక్కడున్నారో కానీ ఏమీ అర్థం కాదు. 55 శాతం మందికి కళ్లు తిరుగుతాయి. వెహికల్ మీద కంట్రోల్ కోల్పోతారు. 35 శాతం మందికి తమ కారు ఒకవైపు వెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది. 25 శాతం మందికి చెమటలు పట్టడమే కాకుండా.. కాళ్లు చేతులు కూడా చల్లగా అయ్యి గుండె వేగంగా కొట్టుకుంటుంది. 25 శాతం మందికి బాడీ స్టిఫ్‌గా అయిపోతుంది. దీంతో తమకు హార్ట్ అటాక్ వచ్చిందనుకొని భయపడి ఈసీజీ వంటివి చేయిస్తే.. అన్నీ నార్మల్‌గానే ఉంటాయి.
సాధారణంగా డ్రైవింగ్ ఎలా చేస్తున్నారని చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు తప్ప వాళ్ల హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూడరు. బ్యాలెన్స్ సిస్టంను చెక్ చేయరు. అయితే మోటరిస్ట్ వెస్టిబులర్ సిండ్రోమ్తోనే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ సమస్యతో బాధ పడేవారికి 60శాతం మందిలో మైగ్రేన్ ఉన్నట్లు గుర్తించారు.మెయిన్‌గా 30 నుంచి 45ఏళ్ల వారిలో అందులోనూ మహిళలలో ఎక్కువగా ఈ సమస్యలున్నట్లు గుర్తించారు. అయితే దీనిని ట్రీట్‌మెంట్‌తోనే నయం చేసుకోవచ్చు. న్యూరో ఆటాలజిస్ట్ స్పెషలిస్ట్ (Neuro Otologist Specialist) డాక్టర్ దగ్గరకు వెళ్లి కొన్ని మందులు వాడితే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మందులు, ఎక్స్ర్సైజులతో నయమవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE