మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే లాభమా? నష్టమా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?

Is Adding Salt to Buttermilk Beneficial Loss,Is Adding Salt to Buttermilk,Buttermilk Beneficial Loss,Buttermilk,Is adding salt to buttermilk beneficial, buttermilk loss, Ayurveda,Mango News,Mango News Telugu,Health Benefits of Buttermilk,Adding salt to curd or buttermilk,Buttermilk Mistakes,Buttermilk Benefits Latest News,Buttermilk Benefits Latest Latest Updates,Health Benefits Latest News,Health Benefits Latest Updates
Buttermilk,Is adding salt to buttermilk beneficial, buttermilk loss?, Ayurveda

పెరుగు, పాలు వంటివి ఆరోగ్యానికి మంచివని ప్రతీ రోజూ వాటిని ఆహారంలో చేర్చుకుంటారు. అయితే చాలామంది పెరుగు కంటే  మజ్జిగ మంచిదని మజ్జిగనే వాడుతూ ఉంటారు. అయితే పెరుగు, మజ్జిగ వంటివాటిని రాత్రి పూట తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది తీసుకోరు. కాకపోతే మజ్జిగ తాగిన ప్రతిసారీ రుచికోసం ఉప్పు కలుపుకొని తాగుతూ ఉంటారు.

మజ్జిగను తాగేవాళ్లలో చాలామంది మసాలాలను, పుదీనా చట్నీని, పచ్చిమిర్చిని,అల్లం, కరివేపాకును  దంచి కూడా మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మజ్జిగలో ఉప్పును కలిపి తాగడం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు  చెబుతున్నారు. మజ్జిగలో ఉప్పు కలపి తాగడం  వల్ల జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచే ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుందట. దీని వల్ల పొట్టకు హాని కలుగుతుంది. అందుకే పొరపాటున కూడా ఉప్పు కలిపిన మజ్జిగను తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

మజ్జిగలో ఉప్పు కలపడం వల్ల తాగిన తర్వాత నీరసం, అలసట, పొట్ట భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు పొట్టంతా గ్యాస్ నిండి అపాన వాయువు వంటి సమస్యలు  తలెత్తే అవకాశం కూడా ఉంది. మొత్తంగా మజ్జిగ, ఉప్పు కాంబినేషన్ వల్ల  పొట్ట మీద చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే.. ప్రేగు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.ఎందుకంటే పెరుగు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థం కాబట్టి. పెరుగులో ఉండే లక్షణాలే మజ్జిగ, లస్సీలలో ఉంటాయి. కాకపోతే ఉప్పు కలపడం వల్ల  కడుపులోని మంచి బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నెమ్మదిగా మంచి బ్యాక్టీరియా చనిపోతుందన్న విషయం చాలామందికి తెలియదు.అంతేకాకుండా పుల్లగా ఉండే పెరుగును తీసుకోవడం వల్ల కూడా  శరీరంలోని మంచి బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

పెరుగు పుల్లనిది, అలాగే ఆమ్ల పదార్థం కాబట్టి పెరుగు, మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే శరీరానికి కావలసిన ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కాకపోతే మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కఫం, పిత్తం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. దీంతో  పాటు ఎసిడిటీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =