సిబిల్ స్కోర్ కోసం వేరే యాప్‌లతో పని లేదు..

New Free Services in Phonepe,New Free Services,Free Services in Phonepe,Services in Phonepe,Phonepe,New Free Services in Phonepe,other apps, CIBIL SCORE,Mango News,Mango News Telugu,Best Payment Gateway in India,PhonePe International Transfer,Phonepe Services Latest News,Phonepe Services Latest Updates,Phonepe Services Live News, New free services in phonepe Latest News,New free services in phonepe Latest Updates
Phonepe,New Free Services in Phonepe,other apps, CIBIL SCORE,

ప్రస్తుతం ఎక్కడో తప్ప చాలాచోట్ల డిజిటల్ పేమెంట్ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి. అందుకే  ఫోన్ పే యాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను  అందిస్తోంది. తాజాగా అలాగే  తమ యూజర్ల కోసం  ఈ-అప్లికేషన్ క్రెడిట్ అనే  కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. దీంతో ఫోన్ పే యాప్‌లో క్రెడిట్‌కి సంబంధించిన అన్ని సర్వీసులను పొందొచ్చు.

ఈ సర్వీసులను ఫోన్ పే యాప్‌లో  యాక్సెస్ చేయడానికి ముందుగా ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్‌కి వెళ్లి యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ పే యాప్ అందిస్తున్న సర్వీసులతో క్రెడిట్ బ్యూరో స్కోర్‌ను ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా క్రెడిట్ సెక్షన్లో క్రెడిట్ స్కోర్‌లను కూడా చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులో లోన్‌లను కూడా మేనేజ్ చేయడానికి కొత్త లోన్ ఆప్షన్స్‌ను కూడా ఫోన్ పే యాప్ నుంచి యాక్సెస్ చేయొచ్చు.

ఫోన్ పే అప్డేట్ చేశాక యాప్ ను ఓపెన్ చేసి హోం స్క్రీన్ లో  హోమ్ పక్కన క్రెడిట్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. వెంటనే క్రెడిట్ పేజీలో టాప్ సెక్షన్ లో క్రెడిట్ స్కోర్ ఆప్షన్ ‌లో ఉన్న  చెక్ నౌ బటన్ పై క్లిక్ చేస్తే.. ప్రస్తుత క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవచ్చు. క్రెడిట్ రూపే కార్డులను లింక్ చేయడానికి.. ఆ పేజీలోనే కనిపించే మేనేజ్ క్రెడిట్ సెక్షన్‌పై ట్యాప్ చేస్తే క్రెడిట్ ప్రొఫైల్స్, మేనేజ్ డ్యూస్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే వాటి వివరాలు పొందొచ్చు. ఒకవేళ ఈ సెక్షన్ ఇంకా రాకపోతే కొన్ని రోజులు ఆగి ఫోన్ పే మరోసారి అప్డేట్ చేయాలి.

సిబిల్ స్కోర్ క్రెడిట్ సెక్షన్ నుంచి ఫ్రీగా ఎంత క్రెడిట్ ని ఉపయోగించారు, ఎంతకాలం క్రెడిట్‌ని కలిగి ఉన్నారు, ఎంత సమయానికి బిల్లులు చెల్లించారు వంటి హిస్టరీ సమ్మరీని పొందొ చ్చు. టోటల్‌గా ఇది క్రెడిట్ ని ఎలా మెరుగుపరచాలో మనం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే దీని ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐ లోన్ లను ఫోన్ పే యాప్ నుంచి ఈజీగా చెల్లించొచ్చు. అనేక యాప్‌లు,  వెబ్సైట్లు వాడక్కర లేదు.   క్రెడిట్, రూపే కార్డులను యాప్ నుంచి యూజర్లు మేనేజ్ చేసి డ్యూ పేమెంట్స్ కోసం అలౌడ్స్ రిమైండర్ లను పొందొచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =