ఫిబ్రవరిలోనే లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది

Julius Caesar's calendar,A leap year to align with the solar year, 2024 is a leap year, leap year come in February, extra day to the calendar, every four years, February, February 2024, leap year, February 29th, 2024 calendar, 366 days, Julian calendar, Mango News Telugu, Mango News
Julius Caesar's calendar,A leap year to align with the solar year, 2024 is a leap year, leap year come in February,

ప్రతీ నాలుగేళ్ల కొకసారి వచ్చే ఓ ప్రత్యేకతను ఈ 2024 వ సంవత్సరం మోసుకొచ్చింది. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉండగా.. నాలుగేళ్లకు  ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. దీన్ని లీప్ ఇయర్‌గా పిలుస్తారు. ఈ లీప్ సంవత్సరం 2020లో రాగా, మళ్లీ  4 సంవత్సరాల తర్వాత 2024 అంటే ఈ ఏడాది.. లీప్ ఇయర్‌ అయింది.

అయితే కొద్ది మందికి అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి? ఇది ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వస్తుందన్న సందేహాలు వస్తుంటాయి.  సాధారణంగా ప్రతీ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. కానీ ఈ లీప్ ఇయర్‌లో మాత్రం సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఇలా ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి వస్తాయి. అలా యాడ్ అయిన ఒక్కరోజుతో ప్రతీ ఏడాది ఫిబ్రవరి నెలలో వచ్చే 28 రోజులు కాకుండా ఆ ఇయర్ మాత్రం ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి.

నిజానికి  లీప్ సంవత్సరం ఎందుకు వచ్చిందంటే..మన క్యాలెండర్‌లో సీజన్స్ మారుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే కదా. ఆ సీజన్స్ మధ్య సమతుల్యత ఉండటానికి లీప్ ఇయర్స్, లీప్ డేలు అవసరం అని మొదటిలోనే పరిశోధకులు గుర్తించారు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం సుమారు 365.2422 రోజులు. అంటే 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం అన్నమాట. ఆ ఎక్కువ కాలాన్నే లీప్ సంవత్సరంగా నామకరణం చేశారు.

లీప్ ఇయర్‌ను  ఫిబ్రవరి నెలలో వచ్చే రోజులతోనే  ఎందుకు కౌంట్ చేస్తారనే  డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే దీనికి ఓ కారణం ఉంది. పురాతన రోమ్‌లోని జూలియస్ సీజర్.. క్యాలెండర్ రీఫార్మ్ చేసే సమయంలో క్యాలెండర్లో చేసే మార్పులన్నిటినీ ఫిబ్రవరి నెలలోనే చేశారంట. అందుకే  అప్పటి నుంచి ఇది అలాగే కొనసాగుతుంది.

అంతేకాదు ఈజిప్షియన్ సౌర క్యాలెండర్ నుంచి ప్రేరణ పొందిన  జూలియస్ సీజర్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో క్యాలెండర్ సంవత్సరాన్ని సోలార్ ఇయర్‌తో అలైన్‌మెంట్ చేయడానికి లీప్ ఇయర్ కూడా ఉంది. 1582లో జూలియస్ క్యాలెండర్..  గ్రెగొరీ రూపొందించిన గ్రెగోరియన్ క్యాలెండర్‌గా పరిణామం చెందిన తర్వాత కూడా, ఫిబ్రవరికి లీప్ డేని జోడించే ఆనవాయితీ కొనసాగింది.

మరోవైపు పొప్ గ్రెగొరీ XIII కూడా జూలియస్ చెప్పినట్టుగానే కొత్త ఏడాదిగా జనవరి 1 అనే నిర్ధారించారు. అలాగే ఫ్రాన్స్ చక్రవర్తి చార్లెస్  అప్పటివరకు 11వ నెలగా అనుసరిస్తున్న జనవరినే మొదటి నెలగా ఉంచి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. దాంతోనే కొత్త సంవత్సరం జనవరి 1న జరుపుకోవడం ప్రారంభం అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =