కొత్తగా కనుగొన్న సాలె పురుగుకు సచిన్ టెండూల్కర్ పేరు

Marengo Sachin Tendulkar,latest political breaking news, Mango News Telugu, Marengo Sachin Tendulkar, Marengo Sachin Tendulkar New Species Of Spider Named After legendary Cricketer, national news headlines today, national news updates 2019, National Political News 2019, New Species Of Spider Named After legendary Cricketer, New Species Of Spider Named After legendary Cricketer Sachin Tendulkar

గుజరాత్ ఎకోలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిఇఇఆర్) సంస్థలో జూనియర్ పరిశోధకుడైన ధ్రువ్ ప్రజాపతి ‘స్పైడర్‌ టాక్సానమీ’ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలలో భాగంగా రెండు కొత్త జాతుల సాలెపురుగులను కనుగొన్నారు. అయితే తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్ పై ఉన్న ఇష్టంతో అందులో ఓ సాలె పురుగుకు సచిన్‌ పేరుతో నామకరణం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరో సాలెపురుగుకు కేరళ రాష్ట్రంలో విద్యపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర వహించిన సెయింట్ కురియాకోస్‌ ఎలియాస్‌ చవారా పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘ఆర్థ్రోపొడా సెలెక్టా’ అనే రష్యన్‌ పత్రిక సెప్టెంబర్ సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ధ్రువ్ ప్రజాపతి మీడియాతో మాట్లాడుతూ, సచిన్‌ టెండూల్కర్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనపై అభిమానంతోనే కొత్తరకం సాలె పురుగుకు ‘మారెంగో సచిన్‌టెండూల్కర్’ అని పేరు పెట్టానని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here