వీఓఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

AP Government Hikes Velugu VOAs Salaries, AP Govt Hikes Velugu VOAs Salaries, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Government Hikes Velugu VOAs Salaries, Govt Hikes Velugu VOAs Salaries, Mango News Telugu, Velugu VOAs Salaries Hikes, Velugu VOAs Salaries Hikes In AP

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు హామీలను ఇప్పటికే అమలులోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా మరో హామీని నెరవేర్చారు. ‘వెలుగు’ విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ)ల గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,297 మంది వెలుగు వీఓఏలు ప్రయోజనం పొందనున్నారు. పెంచిన రూ.10 వేల వేతనంలో ప్రభుత్వం నుంచి రూ.8 వేలు, గ్రామ సంఘాల నుంచి రూ.2 వేలు చెల్లించనున్నారు. వారితో పాటు మెప్మా, యానిమేటర్లు, సంఘమిత్రాలకు కూడ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన వేతనాలు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =