శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 20వ పాఠం పార్ట్-A, పార్ట్-B లలో కథ బాగుండేలా రాసేందుకు పాటించాల్సిన 23 రూల్స్ ను వివరించారు. సినిమా కథ ప్రేక్షకులకు నచ్చాలని, ఒక సినిమా బాగా ఆడేది, ఆడకపోవం కేవలం ప్రేక్షకులే నిర్ణయించగలరని చెప్పారు. కథలో సంఘర్షణ లేకుంటే ఎవరూ సినిమాని ఆడించలేరని చెప్పారు. సినిమా కథ రాయడానికి ముఖ్యమైన రూల్స్ తో పాటుగా పాత సినిమాల్లో కథలకు, ఇప్పటి సినిమాల్లో కథలకు గల వ్యత్యాసాలను ఈ ఎపిసోడ్ లలో పరుచూరి గోపాలకృష్ణ గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]