ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి రాఫెల్ నాదల్ ఔట్

2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, Australian Open Match, latest sports news, latest sports news 2020, Mango News Telugu, Rafael Nadal Lost To Dominic Thiem, Rafael Nadal Lost To Dominic Thiem In Australian Open, sports news

మెల్‌బోర్న్‌ లో జనవరి 29, బుధవారం నాడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ 1 రాఫెల్ నాదల్ ఓడిపోయాడు. ఊహించని విధంగా అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆస్ట్రియా ఆటగాడు, ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (8/6)తో రాఫెల్‌ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. టై బ్రేకర్స్ ద్వారా మొదటి రెండు సెట్లను కోల్పోవడంతో నాదల్ వెనుకబడిపోయాడు. మూడో సెట్‌ను నాదల్ 6-4తో చేజిక్కించుకున్నప్పటికీ నాలుగో సెట్ లో టై బ్రేకర్ తో థీమ్ మరోసారి పై చేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 4 గంటలపైగా సాగిన ఈ మ్యాచ్‌లో డొమినిక్‌ థీమ్‌ 14 ఏస్‌లు సంధించి, నాలుగుసార్లు నాదల్‌ సర్వీసెస్ ను బ్రేక్‌ చేశాడు. ఫెడరర్ రికార్డును సమం చేయాలనుకున్న నాదల్ కు ఈ ఓటమితో షాక్ తగిలినట్టయింది.

మ్యాచ్ అనంతరం థీమ్ మాట్లాడుతూ, రాఫెల్ నాదల్ తో జరిగిన మ్యాచ్‌లో మానసికంగా కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నానని, అయితే టై బ్రేకర్‌లో అవకాశంతో నిలబడగలిగానని చెప్పాడు. మరోవైపు సెమీ-ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో డొమినిక్ థీమ్ ఆడనున్నాడు. ప్రపంచ ఏడో సీడ్ జ్వెరెవ్ 1-6, 6-3, 6-4, 6-2తో మాజీ చాంపియన్‌, స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాను ఓడించి సెమీఫైనల్ చేరుకున్నాడు. ఇక మరో సెమీ-ఫైనల్లో 6 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ 7 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్న నోవాక్ జొకోవిచ్‌తో తలపడనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =