తోలి రోజు ఆదుకున్న రహానే, వర్షం అంతరాయం

cricket highlights, cricket news, cricket west indies, ind vs wi 2019, india cricket highlights, India tour of West Indies 2019, india vs west indies, India vs West Indies 1st Test, India Vs West Indies 3rd ODI, india vs westindies, India Wins ODI Series, Rahane fights back after a top-order collapse, west indies, west indies vs india, west indies vs india 2019, wi vs ind, windies vs india 2019

వెస్టిండీస్ తో జరుగుతున్న తోలి టెస్టులో తోలిరోజు భారతజట్టు గట్టి పోటీ ఎదురుకుంది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత ఆటగాళ్లను వెస్టిండీస్ బౌలర్లు కట్టడి చేసారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది, మ్యాచ్ 47.2 ఓవర్లకు చేరుకున్నప్పుడు వర్షం వలన ఒకసారి విరామం ప్రకటించారు. మళ్ళీ 68.5 ఓవర్లో వర్షం పడడంతో, వాతావరణం సహకరించడం లేదని మొదటిరోజు ఆటను నిలిపివేశారు. భారత జట్టు 68.5 ఓవర్లకి 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానే 81 పరుగులతో ఆదుకోవడంలో జట్టు మొదటి రోజు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఓపెనర్ రాహుల్ 44 పరుగులతో రాణించాడు.

బ్యాటింగ్ మొదలు పెట్టిన భారతజట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 5వ ఓవర్లో రౌచ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు, అదే ఓవర్లో మూడోస్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన చటేశ్వర పుజారా సైతం రౌచ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8వ ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడ అవుట్ అవ్వడంతో 25 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రాహుల్ తో కలిసి అజింక్య రహానే ఇన్నింగ్ చక్కదిద్దడంతో లంచ్ సమయానికి 68 పరుగులు చేసింది. తరువాత హనుమ విహరితో కలిసి రహానే వెస్టిండీస్ బౌలర్లను దీటుగా ఎదురుకున్నారు. విహారి 32 పరుగులు, రహానే 81 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 68.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిపించడంతో సెషన్ మిగులుండగానే ఆటను ఆపేసారు. ఆట ఆగిన సమయానికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ (20), రవీంద్ర జడేజా(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + two =