సీబీఐ కస్టడీకి చిదంబరం

INX Media Case-CBI gets Chidambaram custody for four days,CBI gets Chidambaram custody for four daysChidambaram Arrested In INX Media Case, Chidambaram INX Media Case, Chidambaram INX Media Case Live Updates, Congress Leader P Chidambaram INX Media Case, Chidambaram INX Media Case Live Updates, Congress Senior Leader P Chidambaram arrested, Congress Senior Leader P Chidambaram arrested In INX Media Case, Former Finance Minister of India, INX Media case Live, Mango News Telugu

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు విచారణలో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరడంతో న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా, నాలుగు రోజులకు అనుమతిస్తూ న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ ఆదేశాలు ఇచ్చారు. చిదంబరం పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, విస్తృత దర్యాప్తు, సంబంధిత సమాచారం వెలుగులోకి రావడానికి విచారణ తప్పనిసరి అని భావిస్తున్నాం అని న్యాయమూర్తి చెప్పారు.

గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ, సాయంత్రం హాజరు పరచడంతో ఉత్కంఠ నెలకుంది. సీబీఐ తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు చార్జిషీట్ దాఖలు చేయలేదని న్యాయస్థానానికి వివరించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అసలైన నిజాలు బయటకు తీసేందుకు ఐదు రోజుల పాటు చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వాలని కోరారు. సీబీఐ వద్ద అడగడానికి ప్రశ్నలేవి లేవని, పదేపదే ఒకే రకం ప్రశ్నలతో ఇబ్బందిపెడుతున్నారని చిదంబరం తరుఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ వారి వాదనను గట్టిగా వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ కు అనుమతి ఇవ్వడానికే మొగ్గు చూపారు. ఈ నాలుగు రోజులపాటు చిదంబరం కుటుంబసభ్యులు, న్యాయవాదులు రోజు అరగంట పాటు చిదంబరాన్ని కలిసే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

 

[subscribe]
[youtube_video videoid=ENbzcdzzNcU]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =