కుటుంబంతో సోనియాగాంధీని కలిసిన రేవంత్ రెడ్డి

MP Revanth Reddy Meets Sonia Gandhi Along with Family,Mango News,Political Breaking News 2019,Revanth Reddy Family Meets Congress Chief Sonia Gandhi,MP Revanth Reddy Family with Sonia Gandhi,Congress President Sonia Gandhi,MP Revanth Reddy Latest News

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఢిల్లీలోని ఆమె నివాసానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. సోనియా గాంధీని కలిసిన వారిలో రేవంత్ రెడ్డి భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. అయితే ఆమెను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమావేశానికి ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర పాలనలో పూర్తి స్థాయిలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై దీర్ఘకాలిక కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖలకు ఇచ్చిన ర్యాంకులే పరిపాలనకు నిదర్శమని, ఇకనైనా సమర్ధవంతమైన మంత్రులను నియమించుకుని పరిపాలన కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here