భారత క్రికెట్ ను దేవుడే రక్షించాలి

Sourav Ganguly hits out at BCCI after notice to Rahul Dravid,Sourav Ganguly hits out at BCCI,Sourav Ganguly,Rahul Dravid,virat kohli, cricket, bcci, latest news, cricket highlights, news update, cricket cloud, team india, ms dhoni, national cricket academy, indian premier league, indian cricket team,Mango News Telugu,Sports News,Sports Updates,cricket updates,cricket news

భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. తన సహచర ఆటగాడు, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న రాహుల్ ద్రావిడ్ కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేయడంపై గంగూలీ మండిపడ్డాడు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజయ్ గుప్తా, రాహుల్ ద్రావిడ్ విరుద్ధ ప్రయోజనాలు కలిగిఉన్నాడని ఆరోపణలు చేయగా, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ మంగళవారం నాడు ద్రావిడ్ కు నోటీసులు పంపించారు. ఒక వైపు జాతీయ అకాడమీలో పనిచేస్తూనే, ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి సంబంధించిన ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఏవిధంగా విధులు నిర్వర్తిస్తారంటూ సంజయ్ గుప్తా చేసిన ఆరోపణలపై రాహుల్ ద్రావిడ్ ను వివరణ కోరారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్లో సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, భారత క్రికెట్ లో కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (విరుద్ధ ప్రయోజనాలు) అంశం ఒక కొత్త తమాషా అయిపోయింది. వార్తల్లో ఉండడానికి ఇప్పుడు ఇదో అత్యుత్తమ మార్గంలా మారింది. రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజ క్రికెటర్ కి నోటీసులు పంపుతున్నారంటే ఇక భారత క్రికెట్ ను దేవుడే కాపాడాలి అన్నారు. భారత జట్టు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడ ఈ విషయంలో గంగూలీకి మద్ధతు ప్రకటించాడు. ద్రావిడ్ లాంటి వ్యక్తులకు నోటీసులు ఇవ్వడమంటే వారిని అవమానపరచడమే, భారత క్రికెట్ కు వారి సేవలు అవసరం అని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =