పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు

2019 AP News, AP News, AP Political Updates, Centre Issues Show Cause Notice, Centre Issues Show Cause Notice To AP, Centre Issues Show Cause Notice To AP Govt, Centre Issues Show Cause Notice To AP Govt Over Polavaram, Mango News Telugu, Polavaram, Polavaram Project, Show Cause Notice, Show Cause Notice To AP, Show Cause Notice To AP Govt, Show Cause Notice To AP Govt Over Polavaram

ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కేంద్రం కోరింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యే లోపల ప్రధాన ఎడమ కాలువ నుంచి ఆయకట్టుకు నీరు అందించే విధానంలో భాగంగా నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ-అటవీశాఖ నోటీసులు జారీ చేసింది.

పోలవరం మరియు దానికి సంబంధించిన అనుబంధ ప్రాజెక్టులపై తనిఖీలు నిర్వహించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు, అవసరానికి మించి పర్యావరణ అనుమతులను ఉల్లంఘించినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇదే విషయంపై జూలై 22న జాతీయ హరిత ట్రిబ్యునల్ లో అఫిడవిట్ దాఖలు చేసారు. ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఒక వైపు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ , ఇతర కేంద్ర మంత్రులను కలుస్తున్న సమయంలో కేంద్రం ఈ నోటీసులు అందజేయడం విశేషం. మరో వైపు ఉల్లంఘనల నోటీసుపై ఎన్‌జీటీ ముందు తమ వాదన గట్టిగా వినిపించడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుంది.

 

[subscribe]
[youtube_video videoid=XH2aX9gZ6KE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =