నన్నపనేని రాజకుమారి రాజీనామా

Rajakumari Resigns From Women Commission Chairperson Post,ap women commission chairperson,Andhra Pradesh Political News,Ap Political News Live Updates,Nannapaneni Rajakumari Resigns As AP Women Commission Chairperson,Woman Commission Chairperson Nannapaneni Rajakumari Resigns

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో నన్నపనేని రాజకుమారి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది గనుక నైతికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా తాను చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు పై గవర్నర్ కి వార్షిక నివేదికలు అందజేశానని చెప్పారు. ఆ నివేదికలు చూసిన గవర్నర్ అభినందించినట్టు చెప్పారు. ఆడవారిపై జరిగిన అమానుష సంఘటనలపై స్పందించి, బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని చెప్పారు. రాష్ట్రంలో మహిళా వసతి గృహాల్లో భద్రతా పెంచవలసిన ఆవశ్యకత ఉందని, రాష్టంలో కుటుంబ వ్యవస్థలను పటిష్ట పరచాలని ప్రభుత్వాన్ని కోరారు, అప్పుడే మహిళలపై నేరాలు తగ్గుతాయని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here