స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ, ఆస్ట్రేలియా భారీ స్కోర్

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, Steve Smith Hits 3rd Double Century, Steve Smith Hits 3rd Double Century In Ashes, Steve Smith Hits 3rd Double Century In Ashes Series, Steve Smith Latest Record

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తోలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించాడు. గాయం కారణంగా మూడో టెస్టుకి దూరంగా ఉన్న స్టీవ్ స్మిత్ ఈ టెస్టులో తన అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి 24 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 211 పరుగులు చేసాడు. ఈ యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ బౌలర్లును అలవోకగా ఎదురుకుంటూ, స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. స్మిత్ డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్ ను రెండో రోజు 497/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ టిమ్ పైన్ 58, బౌలర్ మిచెల్ స్టార్క్ 54 పరుగులు చేసారు.

ఆస్ట్రేలియా ఓవర్‌నైట్‌ స్కోర్ 170/3 తో ఆట మొదలవ్వగా, స్టీవ్ స్మిత్ 60, హెడ్ 18 పరుగుల నుంచి ఇన్నింగ్స్ కొనసాగించారు. రెండో రోజు తనదైన ఆటతీరుతో స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. 65 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వదిలేసాడు, సెంచరీ తరువాత స్టీవ్ స్మిత్ మరోసారి స్లిప్స్ లో స్టోక్స్ కి క్యాచ్ ఇచ్చాడు కానీ అది నోబాల్ కావడంతో స్టీవ్ స్మిత్ బయటపడ్డాడు. ఇలా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లిన స్మిత్ యాషెస్ సిరీస్ లో మరోసారి అద్భుతమైన గణాంకాలను నమోదు చేసాడు. ఇక రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు, ఓపెనర్ డెన్లీ వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =