న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Development Bank Vice President Meets AP CM YS Jagan, Mango News Telugu, New Development Bank Vice President Meets AP CM, New Development Bank Vice President Meets AP CM YS Jagan, New Development Bank Vice President Meets CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు అయిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులతో గురువారం నాడు భేటీ అయ్యారు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఎన్ జాంగ్, ప్రాజెక్టు హెడ్ రాజ్ పుర్కర్ తాడేపల్లి నివాసంలో ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 6 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న నేపథ్యంలో ఆ అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో రోడ్లను మెరుగుపరచటంతో పాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రుణం మంజూరులో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, మిగిలిన 70 శాతాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. 32 సంవత్సరాల వ్యవధిలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలలు, ఆసుపత్రులు, స్వచ్ఛమైన త్రాగునీరు, మరియు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులకు మరింత సహాయం అందివ్వాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.

 

[subscribe]
[youtube_video videoid=BGnfdu1iek0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 11 =