తెలంగాణ ఏర్పడ్డాక సహకార సంఘాలు బలోపేతం, డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Agriculture Minister Singireddy Niranjan Reddy Releases Co-operative Dept Diary and Calendar,Agriculture Minister Singireddy Niranjan Reddy,Minister Singireddy Niranjan Reddy,Telangana Minister Singireddy Niranjan Reddy,Telangana Minister Niranjan Reddy,Mango News,Mango News Telugu,Niranjan Reddy Releases Co-operative Dept Diary and Calendar,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ గృహకల్పలో తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సహకార శాఖ ఉద్యోగులకు నిరంతర శిక్షణలు ఇవ్వాలని, పెరుగుతున్న సంపద దుర్వినియోగం కాకుండా కాపాడాలని అన్నారు. సాగునీటి రాకతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో సహకార శాఖ ప్రాధాన్యం పెరిగిందన్నారు.

“నీటి వృధాను అరికట్టడం, సాగు చేయాల్సిన పంటల రకాల మీద రైతులను చైతన్యం చేసే బాధ్యత సహకార శాఖ అందిపుచ్చుకోవాలి. ప్రతి రంగంలో మనుషుల మధ్య సంబంధాలను పెంచేందుకు కృషిచేయాలి. సహకార సంఘాలు బలోపేతం కాకుంటే కార్పోరేట్ వ్యవస్థ వేళ్లూనుకుంటుంది. దాని వల్ల సమాజానికి నష్టం చేకూరుతుంది. గతంలో సహకార సంఘాలలో ఉద్యోగాల జీతాలకు ఇబ్బందులుండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సహకార సంఘాలు బలోపేతం అయ్యాయి. సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. నా పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరిస్తాను, మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సహకార ఉద్యోగులు వివిధ స్థాయిల వారు కేరళలోని సహకార సంఘాలను అధ్యయనం చేయాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం నేత నర్సింహారెడ్డి, సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు, అడిషనల్ రిజిస్ట్రార్లు సుమిత్ర, శ్రీనివాసరావు, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =