అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుక పిల్లలు స్వాధీనం, నెహ్రూ జూపార్క్ కు పంపించిన పీసీసీఎఫ్ డోబ్రియల్

Alexandrine Parakeets were Seized by by Telangana Forest Department PCCF Dobriyal Orders to Send Nehru Zoo Park,Alexandrine Parakeets,were Seized by by Telangana,Telangana Forest Department,PCCF Dobriyal Orders,Send Nehru Zoo Park,Mango News,Mango News Telugu,Nehru Zoo Park Ticket Price,Nehru Zoological Park Tickets,Nehru Zoological Park Nearest Metro,Zoo Park Timings,Nehru Zoological Park Entry Fee 2022,Nehru Zoological Park Online Tickets Booking,Nehru Zoological Park Safari,Nehru Zoological Park Timings,Nehru Zoo Park Contact Number,Nehru Zoo Park Map,Nehru Zoo Park Hyderabad Area,Nehru Zoo Park Hyderabad Contact Number,Nehru Zoo Park Area,Nehru Zoo Park Online Booking,Nehru Zoo Park Images,Nehru Zoo Park Distance,Nehru Zoological Park Open Or Closed,Hyd Nehru Zoo Park,Nearest Metro Station To Nehru Zoo Park,Buses To Nehru Zoo Park,Nehru Zoological Park Fees

చూడ చక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విశ్వనీయంగా అందిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు పది రామచిలుకలను ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ పట్టుకుంది. షాద్ నగర్ లో వీటిని కొని, హైదరాబాద్ తరలిస్తుండగా ఆరామ్ ఘర్ దగ్గర అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్ ల నుంచి అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. వైల్డ్ లైఫ్ చట్టం –1972 ప్రకారం ఈ రకమైన రామచిలుకలను వేటాడటం, వెంట ఉంచుకోవటం నేరమని పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు.

విచారణలో తాము వీటిని 25 వేల రూపాయలకు అమ్మేందుకు తరలిస్తున్నామని ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈరకమైన వ్యాపారం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న చిలుక పిల్లలను నెహ్రూ జూ పార్క్ కు తరలించి సంరక్షించాలని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ ఆదేశించారు. హైదరాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది, శంషాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇతర సిబ్బందిని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here