ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Sensational Comments on BRS Party Public Meeting in Khammam,TPCC Chief Revanth Reddy,Sensational Comments on BRS Party,BRS Party Public Meeting,BRS Party Public Meeting in Khammam,Mango News,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం సభలో కేజ్రీవాల్‌, విజయన్‌, భగవంత్‌ మాన్‌, డి.రాజా వంటి జాతీయ నేతలంతా ఉన్నా జేడీయూ నేత కుమారస్వామి రాలేదని గుర్తు చేశారు. ఆయన ఎందుకు రాలేదో సీఎం కేసీఆర్‌ చెప్పగలరా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేస్తున్న కుట్ర కుమారస్వామికి తెలిసినందువల్లే ఆయన బీఆర్ఎస్ సభకు రాలేదని వెల్లడించారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించే ఒక నాయకుడిని కొనుగోలు చేసేందుకు కేసీఆర్‌ రూ.500 కోట్లు ఆఫర్ చేసారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలియజేశారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమై సదరు నాయకుడిని నియంత్రించడంతో కేసీఆర్ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ వేస్తున్న అడుగులను నిశితంగా గమనిస్తే.. ఫిబ్రవరి చివర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని, దీనికోసమే ఏప్రిల్‌లోగా ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించడం కోసమే డిసెంబరులో జరగాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఆయన నిర్వహించలేదని ఆరోపించారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలను ఆరు నెలల్లోపు జరపకుంటే శాసనసభ రద్దు అవుతుందని, వానాకాల సమావేశాలు గతేడాది సెప్టెంబరు 13న ముగిశాయని, శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడంతో మార్చి 15 కల్లా ఆరు నెలల గడువు ముగియనుందని తెలిపారు.

బీజేపీతో ఫైట్ చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, నిజానికి కేసీఆర్ ఆ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. దీనికి నిదర్శనమే.. గుజరాత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడం అని అన్నారు. కేసీఆర్‌కు నిజంగా ప్రధాని మోదీని ఓడించాలని ఉంటే ఎందుకు పోటీ చేయలేదు? అని ప్రశ్నించారు. అలాగే యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీకి, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ‘ఆప్’కు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయలేదని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని మోదీ అమ్ముతున్నారని అంటున్న కేసీఆర్.. ఆయన హయాంలోనే నిజాం సుగర్స్‌ను, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లును మూయించారని, ఆయన కూడా మోదీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here