బీఆర్ఎస్ సభ విజయవంతంపై మంత్రి పువ్వాడ అజయ్ కు ఫోన్ లో సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR Appreciates Minister Puvvada Ajay over the Phone on the Success of BRS Public Meeting in Khammam,CM KCR Appreciates Minister Puvvada Ajay,Minister Puvvada Ajay,Puvvada Ajay over the Phone,Success of BRS Public Meeting,BRS Public Meeting in Khammam,Mango News,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ భారీ స్థాయిలో జరిగింది. భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు హాజరుకావడంతో ఖమ్మం జిల్లా కేంద్రం పూర్తిగా గులాబీ మయంగా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం అవ్వడం, సభకు లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకావడం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సభ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్, బుధవారం రాత్రి జిల్లాకు చెందిన కీలక నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తను హెలికాప్టర్ ద్వారా వీక్షించిన సమయంలోనూ కనుచూపు మేర జన సముద్రం కనిపించిందని సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చారు. బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కోసం మంత్రి హరీశ్ రావుతో కలిసి నిరంతరం పార్టీ నాయకులను, శ్రేణులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ ముందుకు నడిపించి, ప్రజలతో మమేకమైన మంత్రి పువ్వాడ అజయ్ ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

“ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించారు. దేశంలో ప్రతిపక్ష ఐక్య పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర బిందువుగా నిలిచిందని, దానికి ఖమ్మం లో జరిగిన సభనే ఒక సూచికని జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ ప్రకంపనలు సృష్టించనుండగా, ఖమ్మం సభ ఆ భూకంప కేంద్రంగా మారింది” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిపారు.

మరోవైపు ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభ విజయవంతం కావడంపై బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధులను కూడా సీఎం కేసీఆర్ పోన్ లో అభినందించారు. జిల్లా నేతలందరూ సమష్టిగా కృషి చేయడంతోనే బీఆర్ఎస్ సభ ఈ స్థాయిలో విజయవంతం అయ్యిందని, భవిష్యత్‌ లోనూ కూడా ఇదే విధంగా కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించినట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here