ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్షం భేటీ

All-Party Meeting Held, All-Party Meeting Held To Decide Future Activities Of RTC, All-Party Meeting Held To Decide Future Activities Of RTC Strike, Future Activities Of RTC Strike, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Strike Latest News, TSRTC Strike Latest Updates

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె గత 41 రోజులుగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో పలు అంశాలపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సమ్మె జరుగుతున్న తీరు, కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, అఖిలపక్ష నాయకులు నవంబర్ 14, గురువారం నాడు సమావేశమయ్యారు. ఈయూ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కోకన్వీనర్ రాజిరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతు రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ, బీజేపీ నాయకులు, తదితరులు హాజరయ్యారు. సమ్మెలో భాగంగా నవంబర్ 18న నిర్వహించే సడక్ బంద్ కార్యక్రమం, జిల్లాల్లో కార్మికుల ఆత్మహత్యలు, హైకోర్టులో విచారణ, ప్రభుత్వంతో చర్చల లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nine =