హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్

All Wine Toddy Shops Shall Remain Closed for 2 Days in GHMC Limits in View of Ganesh Immersion, Ganesh Immersion, Hyderabad, Hyderabad Liquor shops to be shut for Ganesh immersion, hyderabad wine shop timings today, liquor shops closed in hyderabad, Liquor shops to be shut for Ganesh immersion, Mango News, today wines opening time, wine shop hyderabad, wine shops closed in hyderabad, wine shops closed in hyderabad today, Wine shops in Hyderabad to remain closed in view of Ganesh Immersion, wines closing time in telangana

హైదరాబాద్ నగరంలో రేపు (సెప్టెంబర్ 19, ఆదివారం) గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు నెలకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు గణేష్‌ నిమజ్జనం సందర్భంగా నగరంలోని మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలోని మూడు పోలీస్‌ కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) పరిధిలో సెప్టెంబర్ 19, ఉదయం 9 గంటల నుంచి సెప్టెంబర్ 20, సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు మూసివేయాలని ప్రకటించారు.

అలాగే నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. అంతరాష్ట్ర మరియు జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే లారీలపై శనివారం అర్ధరాత్రి నుంచే నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. నగరంలో రోజువారీగా తిరిగే ఆర్టీసీ బస్సులను కూడా పలుచోట్ల దారి మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్ట్ మరియు రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇక నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపు 27 వేల మంది పోలీసు సిబ్బంది విధులలో పాల్గొంటారని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here