టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భేటీ

Munugode Congress Party Candidate Palvai Sravanti Meets TPCC Chief Revanth Reddy, Palvai Sravanti Meets TPCC Chief Revanth Reddy, TPCC Chief Revanth Reddy, Munugode Palvai Sravanthi Congress Party Candidate, Munugode By-Election, Palvai Sravanthi , Congress Party Candidate , Mango News, Mango News Telugu, Congress Party Candidate Munugode By-Election, Munugode Palvai Sravanthi , Palvai Sravanthi Congress Party Candidate, Palvai Sravanthi, Munugode By-Election Latest News And Updates

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి భేటీ ఈ నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి, కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడులో ప్రచారం, పార్టీ కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేయడంపై రేవంత్ రెడ్డి వారితో చర్చించినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కార్యాచరణ, నేతల సమన్వయంపై కూడా ఇరువురు నేతలకు సూచనలు చేసినట్టు సమాచారం.

ముందుగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపికైన వెంటనే రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ తమకు ఉంటాయని పేర్కొన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ను ఇంకా విడుదల చేయాల్సి ఉండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారో కూడా ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =