కళ్యాణ మండపాలను కూడా వదలని అభ్యర్థులు

Candidates who did not even leave the marriage halls,Candidates who did not even leave,not even leave the marriage halls,marriage halls,Mango News,Mango News Telugu,November, candidates plan for campaigns,Kalyana Mandapam, campaign platform, candidates,candidates plan for campaigns Latest News,candidates plan for campaigns Latest Updates,Marriage Halls Campaign Latest News,Marriage Halls Campaign Latest Updates
November, candidates plan for campaigns,Kalyana Mandapam, campaign platform, candidates

తెలంగాణాలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికల కోసం తెలంగాణలో ఎటు చూసినా పార్టీల జెండాలతో అభ్యర్థుల కోలాహలం కనిపిస్తోంది.  అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిని మించి మరొకరు  మాటల తూటాలు పేలుస్తూ ఓటర్లకు గేలం వేసే పనిలో పడ్డారు. ఎన్నికల కురుక్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి ఎలాంటి పనికి అయినా సిద్ధమవ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు.. గెలిచామా లేదా అన్నదే మ్యాటర్ అనే ఫార్ములాను ఫాలో అవడానికి డిసైడ్ అయ్యారు.

మామూలుగానే ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి చిత్రమైన  విన్యాసాలు చేస్తారు నేతలు. దోశెలు వేయడమే కాదు.. అవసరం అయితే బుడ్డోడికి స్నానాలు కూడా చేయించేస్తారు. అయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నేతలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అది అతి శయోక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. ప్రచారం పీక్స్ లోకి తీసుకెళ్లడానికి అభ్యర్థులంతా ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.

నవంబర్ నెలలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో.. మామూలుగా దీనినో గండం భావించే నేతలంతా..  దీనికి ఓ పరిష్కారాన్ని వెతుక్కుని  ఫాలో అవడానికి రెడీ అయిపోయారు.  నవంబర్లో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో..అంతా  పెళ్లి బిజీలో పడిపోతారు. ఈ సమయంలో కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమెలా అని ఆలోచనలో పడ్డ అభ్యర్థులు దానికో సొల్యూషన్ వెతుక్కున్నారు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదే ప్రచారానికి అనర్హం అన్న ఫార్ములాను ఫాలో అయిపోవడానికి రెడీ అయిపోయారు.  ఎక్కడ పెళ్లి జరిగినా..ఆ  కళ్యాణ మండపాలకు వెళ్లి వాటినే వేదికలుగా మార్చుకోవడానికి సిద్ధం అయిపోయారు.

నవంబర్లో 15 వ తేదీ, 19 వ తేదీ, 21 వ తేదీ, 22 వ తేదీ, 23 వ తేదీ, 24 వ తేదీ, 26 వ తేదీ, 29 తేదీలలో వివాహం జరిపించడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జంటలుగా మారే  అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇదే  సమయంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండడంతో.. ఓటర్లు ఓటు వేయడం మర్చిపోవద్దని ఇప్పటికే అధికారులు ఓటర్లను కోరుతున్నారు. ఇప్పుడు అభ్యర్థులు ఓటు వేయడం మరచిపోవద్దంటూ ఏకంగా గుర్తు చేయడానికి సిద్ధం అయిపోయారు.

పెళ్లిళ్ల హడావిడిలో ఓటర్లు తమను పట్టించుకోరేమోనన్న ఆలోచనలో ఉన్న అభ్యర్థులు..  కళ్యాణ మండపాలకి వెళ్లి అక్కడి వారందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. నవంబర్ 16 నుంచి 23వ తేదీ మధ్య ఎక్కువగా పెళ్లిళ్లు జరగనుండటంతో.. ఆ   తేదీలలో కళ్యాణ మండపాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.తమ తమ నియోజకవర్గంలోని .. గ్రామాల వారీగా ఏ సామాజిక వర్గంలో పెళ్లిళ్లు అవుతున్నాయి?  ఎక్కడెక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి? ఇప్పటికే కార్యకర్తలంతా ఎవరెవరి ఇంట్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయనేది తెలుసుకొని, డైరీలలో నోట్ చేసుకొని తమ నేతల ముందు పెట్టే పనిలో బిజీ అయిపోయారు. దీంతో నవంబర్‌లో పెళ్లి చేసుకునే జంటలకు అనుకోని అతిథుల రాక కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =