డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది డేటా..

Indian Data of 81 Crore People in Dark Web,Indian Data of 81 Crore People,81 Crore People in Dark Web,Indian People in Dark Web,Mango News,Mango News Telugu,Medical Health Department, Indian data leaked again, Indian data, Data of 81 Crore People, Dark Web,Indian People in Dark Web Latest News,Medical Health Department Latest News,Indian Passport Data Breach,Major Data Breach Exposes Personal Details,Massive data breach Latest News,Massive data breach Latest Updates
Medical Health Department, Indian data leaked again, Indian data, Data of 81 Crore People, Dark Web..

భారతీయుల డేటా మళ్లీ బహిరంగ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. అవును వేలు  కాదు లక్షలు కాదు.. భారత దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది భారతీయుల సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్‌వెబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఇది భారత దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద డేటా లీక్‌ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి సేకరించిన ఈ డేటాను కోవిడ్‌-19 పరీక్షల సమయంలో  చోరీ అయినట్లు గుర్తించారు. అయితే ఇది కచ్చితంగా  ఎక్కడి నుంచి లీక్ అయిందనే విషయం మాత్రం ఇంకా తెలియటం లేదు. దీంతో దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ‘Pwn0001’ అనే హ్యాకర్‌  డార్క్ వెబ్‌లో ఈ డేటాను అందుబాటులోకి తెచ్చాడు.

ప్రస్తుతం డార్క్ వెబ్‌లో కనిపిస్తున్న భారతీయుల డేటాలో 81.5 కోట్లమంది పేరు, అడ్రస్,   ఆధార్‌ కార్డ్‌, పాస్‌పోర్టు సమాచారం, ఫోన్‌ నంబర్లు, తాత్కాలిక, శాశ్వత చిరునామాలు అన్నీ ఉన్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఐసీఎంఆర్‌ కోవిడ్‌ పరీక్షల సమయంలో.. కోవిడ్ వ్యాక్సిన్ సమయంలో సేకరించిందని హ్యాకర్‌ చెబుతున్నాడు.

నిజానికి ఈ డేటా చౌర్యం అక్టోబర్‌ 9వ తేదీన  తొలిసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ కంపెనీ దీనిని గుర్తించింది. Pwn0001 అనే వ్యక్తి సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫామ్‌లపై  తన వద్ద 81.5 కోట్ల మంది డేటా ఉందని  చెబుతున్నాడు. వీటిల్లో భారతీయుల ఆధార్‌ కార్డ్, పాస్‌పోర్టు సమాచారం కూడా ఉందని చెబుతున్నాడు. అయితే హ్యాకర్ చెబుతున్నట్లుగానే దీనికి సంబంధించిన లక్ష ఫైల్స్‌ అతడి వద్ద ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. హ్యాకర్ చెప్పిన డేటా గురించి కూపీ లాగడానికి,  వాటిలో వాస్తవాలను గుర్తించడానికి కొన్నింటిని ఆధార్‌ వెరిఫికేషన్‌ ద్వారా చెక్‌ చేశారు. అయితే అదంతా నిజమైన డేటానే అని నిపుణులు నిర్ధారించుకొన్నారు.

సీఈఆర్‌టీ-ఐఎన్‌ అంటే  ది కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా .. ఈ డేటా లీకేజీపై వెంటనే  ఐసీఎంఆర్‌ను అప్రమత్తం చేసింది. కోవిడ్‌ పరీక్షల సమయంలో సేకరించిన డేటా మొత్తం.. మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్, ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ల వద్ద స్టోర్ చేసి ఉందని.. దీంతో ఎక్కడి నుంచి భారతీయుల డేటా లీకైందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా మారిందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా  అంత పెద్ద చర్చకు దారి తీస్తున్నా కూడా.. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ దీనిపై ఇంకా స్పందించలేదు. 2022 డిసెంబర్‌లో ఎయిమ్స్‌ ఢిల్లీలో కూడా.. హ్యాకర్లు కొన్ని కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకొని సుమారు రూ.200 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని డిమాండ్‌ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు హ్యాకర్ డేటా తన వద్ద ఉందని చెప్పాడు కానీ ..ఇంకా ఎటువంటి డిమాండ్లను బయటకు ప్రకటించలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =