కరోనా విజృంభణతో కేంద్రం కీలక నిర్ణయం, తెలంగాణ సహా మూడు రాష్ట్రాలకు కేంద్ర బృందం

Central Team to Visit Telangana, Gujarat and Maharashtra to Monitor Covid-19 Situation

దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పలు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు ఇప్పటికే పర్యటించి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దీ రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపి పరిస్థితులను మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం జూన్ 26 నుంచి జూన్ 29 మధ్య తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఈ మూడు రాష్ట్రాల అధికారులతో కరోనా నివారణకు అమలు జరుగుతున్న చర్యలపై ఈ బృందం చర్చిస్తుందని చెప్పారు. అలాగే కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతోనే ఈ బృందం పనిచేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here