కేశినేని చిన్నికి చంద్రబాబు ఝలక్

Chandrababu, Vijayawada, MP Ticket, Kesineni Chinni, Chandrababus Rejection, TDP leadership blinks, Kesineni Nani Lost crores of money because of TDP, VIJAYAWADA, Lok Sabha elections, Amaravati, CM Chandrababu Naidu, Mango News Telugu, Mango News, Member of Parliament, Latest AP Political Updates
kesineni chinni, kesineni brothers, TDP, Vijayawada MP Ticket

విజయవాడలో మొన్నటి వరకు కూడా రాజకీయాలు ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. కేశినేని బ్రదర్స్ మధ్య రసరవత్తరమై పోరు సాగింది. విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ కోసం ఇటు సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. అటు కేశినేని చిన్నిలు పోటీ పడ్డారు. చివరికి టీడీపీ హైకమాండ్ చిన్ని వైపు మొగ్గుచూపడంతో.. నాని టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొంది తీరుతానని ప్రకటించారు. అటు వైసీపీ హైకమాండ్ కూడా కేశినేని నానికే విజయవాడ ఎంపీ టికెట్ కట్టబెట్టింది.

ఇక తన సోదరుడు నాని వైసీపీలో చేరడంతో.. తనకు టికెట్ దక్కేందుకు లైన్ క్లియర్ అయిపోయిందని కేశినేని చిన్ని భావించారు. అందుకే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. పార్టీ తరుపున పలు  కార్యక్రమాలను నిర్వహించారు.  కానీ ఇప్పుడు చిన్నికి టీడీపీ హైకమాండ్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ టికెట్ తనకు ఇవ్వకుండా.. మరో నేతకు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారట. పలు సర్వేలు చిన్నికి వ్యతిరేకంగా రావడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

నిజానికి విజయవాడ తెలుగు దేశం పార్టీకి కంచుకోట. 2014లో విజయవాడను టీడీపీనే దక్కించుకుంది. ఆ తర్వాత 2019లో కూడా విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ జెండానే ఎగిరింది. 2019 ఎన్నికల వేళ వైసీపీ గాలి బలంగా వీచినప్పటికీ.. ఆ స్థానాన్ని మాత్రం వైసీపీ టచ్ చేయలేకపోయింది. ఈక్రమంలో కంచుకోట అయిన విజయవాడను ఎట్టిపరిస్థితిలోనైనా నిలపుకోవాలని చంద్రబాబు పట్టుపట్టారు. అందుకే చిన్ని స్థానంలో మరో నేతను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఈ సమయంలో గద్దె రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న రామ్మోహన్ 1999లో మొదటిసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. తన ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి గెలుపొందారు. 2019లోనూ రామ్మోహన్ తూర్పు నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం, గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవంతో పాటు.. సౌమ్యుడిగా, మంచి నాయకుడిగా పేరు ఉంది.

ఈక్రమంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్‌ను విజయవాడ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట. కేశినేని చిన్నిని మట్టికరిపించాలంటే అది రామ్మోహన్‌తోనే సాధ్యమని అనుకుంటున్నారట. ప్రస్తుతం రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆ స్థానం నుంచి కేశినేని చిన్నిని పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మరి ఇందుకు చిన్ని ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + three =