టీ-కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు.. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశాలు

Telangana Cyber Crime Police Serves 41A CRPC Notice To Congress Political Strategist Sunil Kanugolu,Congress Political Strategist Sunil Kanugolu,Telangana Cyber Crime Police,Serves 41A CRPC Notice,Mango News,Mango News Telugu,Sunil Political Strategist,Sunil Kanugolu,Sunil Kanugolu Mindshare,Sunil Kanugolu Congress,Sunil Kanugolu Team,Sunil Kanugolu Education,Sunil Kanugolu Biography,Sunil Kanugolu Twitter,Congress Top Politicians,Famous Congress Politicians,Congress Best Politician,Top Congress Politicians,Politicians In Congress,Sunil Political Strategist,Sunil Kanugolu,Sunil Kanugolu Mindshare,Sunil Kanugolu Congress,Sunil Kanugolu Team,Sunil Kanugolu Education,Sunil Kanugolu Biography,Sunil Kanugolu Twitter,Congress Top Politicians,Famous Congress Politicians,Congress Best Politician,Top Congress Politicians,Politicians In Congress

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీ-కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్ మరియు వీడియో మార్ఫింగ్ కేసులో ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో సునీల్ కనుగోలును ఏ1గా పేర్కొన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు అందజేయడం కోసం మంగళవారం కాంగ్రెస్ వార్ రూమ్ కు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో సునీల్ అందుబాటులో లేకపోవడంతో టీ-కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆయన తరపున నోటీసులు అందుకున్నారు. కాగా ఈ నెల 30న సునీల్ కనుగోలు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.

ఇక ఈ నెల 14వ తేదీన హైదారాబాద్‌లోని సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్ వార్‌ రూమ్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పది ల్యాప్‌టాప్‌లు, సీపీయూలు, హార్డ్‌డిస్క్‌లు సీజ్ చేయడంతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి చెందిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది. తర్వాతి రోజు రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలునిచ్చిన క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేయడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత కూడా నెలకొంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం సైతం ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ నిమిత్తం తాజాగా సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =