తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

High Court, High Court Hearing On Telangana Municipal Elections, High Court Hearing On Telangana Municipal Elections Petition, High Court On Telangana Municipal Elections, High Court On Telangana Municipal Elections Petition, Mango News Telugu, Municipal Elections, Municipal Elections Petition, Telangana Municipal Elections, Telangana Municipal Elections Petition, Telangana News Updates, Telangana Political News

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు 109 రోజుల గడువు తీసుకుని, ఇప్పుడు గడువు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే వార్డుల విభజన ఏ విధంగా చేపట్టారు, రిజర్వేషన్స్ పక్రియ ప్రాతిపదికత ఏంటి అని ప్రభుతాన్ని వివరణ కోరింది. అలాగే కొత్త మున్సిపల్ చట్టం వివరాలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విచారణ సందర్భంగా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని చట్టప్రకారమే చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జీవో నెం.78 ద్వారా వార్డుల విభజన, రిజర్వేషన్స్ కేటాయింపు జరిగిందని కోర్టుకు తెలిపారు. పిటిషన్ తరుపు న్యాయవాదులు మాత్రం వార్డుల విభజన సరైన పద్దతిలో జరగలేదని, రాజకీయకోణంలోనే ఈ వ్యవహారాన్ని నడిపించారని కోర్టుకు వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, వార్డుల విభజన ప్రాతిపదికత, కొత్త చట్టం పాత చట్టానికి మధ్య తేడాలు, కొత్త చట్టం గురించి తెలుసుకోవడానికి కోర్టుకు పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

 

[subscribe]
[youtube_video videoid=GCwMoufbNG4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − eight =