తెలంగాణ సీనియర్ ఐఏఎస్‌ స్మితా సభర్వాల్ ఇంట్లో చొరబాటు ఘటనపై పోలీసు నిఘావర్గాల దర్యాప్తు

Telangana Police Intelligence Team Starts investigation on Senior IAS Officer Smita Sabharwal's Home Intrusion Incident,Telangana Police Intelligence,Team Starts investigation,Senior IAS Officer Smita Sabharwal,Smita Sabharwal's Home Intrusion Incident,Mango News,Mango News Telugu,Telangana Crime News,Hyderabad Crime News Yesterday,Telangana Crime News Today,Hyderabad Crime Branch,Hyderabad Crime,Hyderabad Crime News And Latest Updates,Hyderabad Crime News Telugu,Hyderabad Police News

తెలంగాణ సీనియర్ ఐఏఎస్‌ ఆఫీసర్‌, ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) అధికారిణి స్మితా సభర్వాల్ ఇంట్లో చొరబాటు ఘటనపై పోలీసు నిఘావర్గాల దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ప్రాంతంలో గల ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని ప్లజెంట్ వ్యాలీ అనే ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఆమె నివసిస్తుండగా.. గత రెండు, మూడు రోజులక్రితం ఈ ఘటన జరిగింది. అయితే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన నిఘావర్గాలు.. మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్‌ గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డిగా అతడిని గుర్తించారు. ఇక ఆనంద్ కుమార్ తో పాటు అతడి స్నేహితుడు, హోటల్ నిర్వాహకుడు బాబు అనే వ్యక్తి కూడా అదేరోజు కారులో అక్కడికి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, ఇంట్లోకి మాత్రం ఆనంద్ ఒక్కడే వెళ్లినట్లు విచారంలో కనుగొన్నారు. ఉద్యోగ విషయానికి సంబంధించి మాట్లాడే నిమిత్తమై ఆయన స్మిత సభర్వాల్ ఇంట్లోకి వెళ్లినట్లు తేల్చారు.

కాగా ఈనెల 19వ తేదీన స్మితా సభర్వాల్ ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో చొరబడి ఆమె గది తలుపు కొట్టడం, మాట్లాడటానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే వచ్చిన వ్యక్తి ఎవరో ఆమెకు తెలియకపోవడం, అందునా అర్ధరాత్రి సమయం కావడంతో స్మితా సభర్వాల్ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఐనప్పటికీ వెంటనే తేరుకుని డయల్ 100కి కాల్ చేసి విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈలోగా ఆమె ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినప్పటికీ దీనిని పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు.

ఇక దీనిపై స్మితా సభర్వాల్ తన ట్విట్టర్ లో ఇలా తెలిపారు.. ‘ఆ రోజు అర్ధరాత్రి నాకు భయానక అనుభవం ఎదురయింది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే సమయస్ఫూర్తి ప్రదర్శించి నన్ను నేను రక్షించుకున్నా. అందుకే ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రిపూట మన ఇంటి తలుపులు, తాళాలను మనమే స్వయంగా చెక్ చేసుకోవడం మంచిది. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయండి’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =