అవసరమైతే అసెంబ్లీ రద్దు చేస్తా, ధైర్యముంటే ఎన్నికల తేదీని ప్రకటించండి.. బీజేపీకి సవాల్ విసిరిన సీఎం కేసీఆర్‌

CM KCR Challenges BJP To Fix Date For The Early Elections in Telangana, Telangana CM KCR Challenges BJP To Fix Date For The Early Elections in Telangana, KCR Challenges BJP To Fix Date For The Early Elections in Telangana, Early Elections in Telangana, Telangana Early Elections, CM KCR Challenges BJP, Early Elections in Telangana News, Early Elections in Telangana Latest News, Early Elections in Telangana Latest Updates, Early Elections in Telangana Live Updates, Telangana CM KCR Challenges BJP, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమని, అవసరమైతే అసెంబ్లీ రద్దు చేస్తానని సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ పై సీఎం కేసీఆర్‌ పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  • భారత దేశచరిత్రలో అత్యంత అసమర్థమైన ప్రధాని మోదీ, ఆయనకు వ్యతిరేకంగా శ్రీలంకలో కూడా ఆందోళనలు చేస్తున్నారు.
  • దేశంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగింది.
  • గ్యాస్ ధరలు, ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు.. ఇలా ప్రతిదీ పెరిగిపోయింది.
  • విదేశాల నుంచి బొగ్గు కొనుగోళ్లలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది, ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగల్ని ఎందుకు పట్టుకోవట్లేదు?
  • తెలంగాణలో అమలవుతున్న వాటిలో కనీసం 20 శాతమైనా బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్నయా?
  • తెలంగాణ ఇంజన్ స్పీడ్ ఎక్కువ, బీజేపీ సర్కార్ ఇంజన్ స్లో.. తెలంగాణది 100 హెచ్పీ ఇంజన్ అయితే బీజేపీది 50 హెచ్పీ.
  • కేసీఆర్ కేసులకు భయపడడు.. అక్రమంగా ఎన్టీఆర్ ని గద్దె దించితే ఏం జరిగిందో దేశం చూసింది.
  • దేశంలో రూ.3 వేలకే టన్ను బొగ్గు దొరుకుతుంటే.. విదేశాల నుంచి రూ.30 వేలకు టన్ను బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు.
  • ఇక్కడ నన్ను దించాలని చూస్తే, ఢిల్లీలో బీజేపీని దించడం ఖాయం.
  • తెలంగాణ రైతులకు ధరణి, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం.. తెలంగాణ మోడల్ దేశానికి అవసరం.
  • ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలి.. అందుకు అవసరమైతే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుంది.
  • ముందస్తుకు నేను సిద్ధం, అవసరమైతే అసెంబ్లీని రద్దు చేస్తా.. బీజేపీ వాళ్లకు నిజంగా దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించమనండి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + twenty =