జూలై 13న విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్‌.. ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

CM Jagan To Visit Visakhapatnam For Distributing Cheques to YSR Vahana Mitra Beneficiaries on July 13, AP CM Jagan To Visit Visakhapatnam For Distributing Cheques to YSR Vahana Mitra Beneficiaries on July 13, CM YS Jagan To Visit Visakhapatnam For Distributing Cheques to YSR Vahana Mitra Beneficiaries on July 13, AP CM YS Jagan To Visit Visakhapatnam For Distributing Cheques to YSR Vahana Mitra Beneficiaries on July 13, Cheques to YSR Vahana Mitra Beneficiaries, YSR Vahana Mitra Beneficiaries, AP CM YS Jagan To Visit Visakhapatnam, AP CM YS Jagan Visakhapatnam Tour on July 13, AP CM YS Jagan Visakhapatnam Tour, AP CM YS Jagan Visakhapatnam Tour News, AP CM YS Jagan Visakhapatnam Tour Latest News, AP CM YS Jagan Visakhapatnam Tour Latest Updates, AP CM YS Jagan Visakhapatnam Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. కాగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఆటో, టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్లకు వార్షికంగా రూ. 10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

సీఎం జగన్ విశాఖపట్నం పర్యటన షెడ్యూల్‌ ఇదే..

  • జూలై 13 ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • ఉదయం 11:00 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లి 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు.
  • ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు. అనంతరం వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్‌ ఉంటుంది.
  • ఉదయం 11.40 నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు, అనంతరం 11.45 నుంచి 11.47 వరకు వాహన మిత్ర అనే అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది.
  • 11.47 నుంచి 12.17 గంటల వరకు సీఎం జగన్ ప్రసంగించనున్నారు. పా తర్వాత మధ్యాహ్నం 12.20 గంటల నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు.
  • చివరిగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నేతలతో సమావేశమై 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 7 =