తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు/సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ (సీఎస్‌ఎస్)లో ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసిన కేంద్రం వాటా రూ.495.20 కోట్లు తిరిగి తెలంగాణ ఇప్పించాలని ఈ లేఖలో మంత్రి హరీశ్ రావు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై 2022, జనవరి 24న రాసిన లేఖను రిఫర్ చేయాలని కోరారు.
2014-15లో రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా నిష్పత్తిలో కేంద్రం వాటాను విభజించినప్పటికీ, తెలంగాణలో అమలు చేయబడిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ (సీఎస్‌ఎస్)కి సంబంధించి కేంద్రం వాటాను కేంద్రం పొరపాటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసింది. తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు గ్రాంట్లు తప్పుగా ఆంధ్రప్రదేశ్ కు విడుదలయ్యాయి. సీఎస్ఎస్ మ్యాచింగ్ గ్రాంట్ లలో తెలంగాణ హక్కు వాటాను సర్దుబాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు అకౌంటెంట్ జనరల్ కు అనేక అభ్యర్థనలు చేసింది. మా ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కు తప్పుగా జమ చేసిన రూ.495.20 కోట్ల ముందస్తు సర్దుబాటు/విడుదల కోసం మరోసారి అభ్యర్థన చేస్తున్నాం. ఈ విషయంలో మీరు వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం” అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE