ఏప్రిల్ 29న ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు

CM KCR Decides to Host Iftar Party to Muslims on behalf of State Govt on April 29th at LB Stadium, KCR Decides to Host Iftar Party to Muslims on behalf of State Govt on April 29th at LB Stadium, CM KCR Decides to Host Iftar Party to Muslims, Telangana CM KCR Decides to Host Iftar Party to Muslims on behalf of State Govt on April 29th at LB Stadium, Telangana CM KCR Decides to Host Iftar Party to Muslims, Telangana CM KCR Decides to Host Iftar Party to Muslims on behalf of State Govt on April 29th, Iftar Party to Muslims on behalf of State Govt on April 29th at LB Stadium, LB Stadium, Iftar Party to Muslims, CM KCR Decides to Host Iftar Party to Muslims on behalf of State Govt, Iftar Party to Muslims on behalf of State Govt on April 29th at LB Stadium, Iftar Party to Muslims at LB Stadium, Iftar Party at LB Stadium, Iftar Party to Muslims News, Iftar Party to Muslims Latest News, Iftar Party to Muslims Latest Updates, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది” అని తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై అధికారులతో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన ఆదివారం నాడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ ,సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్,డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ సహా పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధికారికంగా ఇచ్చే ఇఫ్తార్ విందుకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ప్రముఖులు హాజరవుతారన్నారు. అతిథులకు ఆహ్వాన పత్రికలు సకాలంలో అందేలా చూడాలని, క్రమశిక్షణతో స్వాగతం పలికి మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు. వేదికను అందంగా అలంకరించాలని, ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీ చేయించాలని, ఏ మాత్రం కొరత రానివ్వకుండా అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును మంత్రులు పరిశీలించి, ఎల్బీస్టేడియం అంతటా కలియ తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =