కరోనా పట్ల భయాందోళనలు వద్దు, ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలి: సీఎం కేసీఆర్

CM KCR held Review Meeting on Covid-19 Situation in the State, CM KCR, Telangana CM KCR, Review Meeting on Covid-19, Covid review meet, Covid-19 India Live, Omicron India Live, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, covid-19 new variant, New Covid 19 Variant, New Covid Strain Omicron, New Coronavirus Strain, Mango News, Mango News Telugu, Telangana Covid rules, Telangana Covid News latest,CM KCR held Review Meeting on Covid-19 Situation in the State

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణా చర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్ లో ఆదివారం నాడు సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదని ప్రజలకు తెలిపారు. అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం అన్నారు.

వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెల్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు.
ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా వుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. గత రివ్యూ సందర్భంగా సీఎం చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు నివేదించారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్ధంగా వున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంఓ అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − four =