తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి : సీఎం కేసీఆర్

2021 World Environment Day, CM KCR, CM KCR About World Environment Day, CM KCR Urged People of State to Protect Environment, CM KCR Urged People of State to Protect Environment on the Occasion of World Environment Day, Mango News, Protect Environment on the Occasion of World Environment Day, World Environment Day, World Environment Day 2021, World Environment Day News, World Environment Day Updates

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్థుతం కరోనా సమయంలో మరోసారి రుజువయ్యిందన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్థున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలం అని సీఎం అన్నారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదనే ఎరుకతోనే తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కార్యాచరణ చేపట్టిందన్నారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్రణను విధిస్తూ గ్రీన్ కవర్ పెంచే హరితహరం వంటి పలు పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నదన్నారు.

తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి:

గ్రామీణ పట్టణాభివృద్దికోసం అమలు చేస్తున్నపలు కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నాయని, జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయని సీఎం గుర్తుచేశారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సాగునీరు రాష్ట్రవ్యాప్తంగా పుష్కలంగా లభిస్తున్నదన్నారు. పలు పథకాల ద్వారా పాడి పంటలు, పండ్లు, కూరగాయలు, మాంసాహారం సమృద్ధిగా ఉత్పత్తి జరిగి, పౌష్టికాహారం రాష్ట్ర ప్రజలకు అందుతున్నదన్నదని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, నదీజలాలను మళ్లించడం ద్వారా అడుగడుగునా పచ్చదనం ప్రకృతి పర్యావరణ సమతుల్యతను సాధించామన్నారు. తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. జీవవైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =